Dil Raju Family Invites Prabhas to Asish Reddy Marriage : దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశీష్ రెడ్డి తెలుగులో రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండో సినిమా రిలీజ్ కూడా కాకుండానే ఒక ఇంటివాడయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఆశిష్ రెడ్డి వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన సోదరుడి కుమారుడిని తీసుకుని, సినీ ప్రముఖులు అందరి దగ్గరికి వెళ్లి వివాహానికి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని తొలిగా సినీ ఇండస్ట్రీ నుంచి ఆహ్వానించగా తర్వాత హీరోలలో ఎన్టీఆర్ ను కూడా ఆహ్వానించారు. ఇక ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటికి వెళ్లి ఆయనని వివాహానికి ఆహ్వానించారు.
Ambajipeta Marriage Band : సుహాస్ “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు” ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?
ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు దిల్ రాజుతో పాటు ఆశిష్ రెడ్డి, శిరీష్ రెడ్డి అలాగే దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి, అల్లుడు హర్షిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. దిల్ రాజుకి ప్రభాస్ కి చాలా రోజుల నుంచి మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి ముందుగా మున్న అనే సినిమా చేశారు. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు కానీ త్వరలోనే చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆశిష్ రెడ్డి ఎంగేజ్మెంట్ 2023 నవంబర్ లో ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహం వాలెంటైన్స్ డే రోజు అంటే ఫిబ్రవరి 14వ తేదీన జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా నిర్వహించేందుకు దిల్ రాజు కుటుంబం ప్రణాళికలు సిద్ధం చేసింది. దిల్ రాజు కుటుంబంలో మొట్ట మొదటి వారసుడు కావడంతో ఆశిష్ రెడ్డి వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.