డల్లాస్ నగరాన్ని మించి హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందని… కానీ జాతి భవిష్యత్ అయిన ఎస్సీ, ఎస్టీ , బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిందని ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు , స్కై ఓవర్లు మాత్రమే కాదని… బలహీన వర్గాల విద్యార్థులు చదివే గురుకుల హాస్టల్ లకు సొంత భవనాలు నిర్మించడం కూడా అభివృద్దే అని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై దృష్టి సారించాలని… ఆయన తలుచుకుంటే సెక్రెటరేట్ ను తలదన్నే తరహాలో గురుకుల హాస్టల్ భవనాలను నిర్మిస్తారని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.
Also Read : Samantha: ఇన్ని వేరియేషన్స్ సినిమాలో కూడా చూపించి ఉండదు…
హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తనకు వచ్చిన ఎంపీ పదవీ తనకు అలంకారం కాదని… బీసీల కోసం పోరాడుతున్న తనకు ఒక ఆయుధం మాత్రమే ఈ పదవీ అని కృష్ణయ్య అన్నారు. సగరా జాతి ప్రజలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఐఎఎస్, ఐపీఎస్ లుగా తీర్చిదిద్దాలని కోరారు. బిసి బంధు అమలు కోసం బీసీలందరు ఐక్యం కావాలని సూచించారు. చట్టసభల్లో సగరులకు ప్రాధాన్యత లేదని… సగరా జనాభా అధికంగా ఉన్న చోట అన్ని రాజకీయ పార్టీలు వారికే సీట్లు కేటాయించాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Also Read : YSRCP: గాలి, నీరు నేనే కనిపెట్టానని కూడా చంద్రబాబు చెప్తారు..!