తుక్కుగుడా వేదికగా రాహుల్ గాంధీ పంచ్ న్యాయ గ్యారెంటీలు ప్రకటించాడని, సోనియా గాంధీ కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు అదే తుక్కుగుడా లో ఆరు గ్యారెంటీ లు ప్రకటించిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వంద రోజుల్లో అమలు చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్.. హామీల అమలు విఫలం అయ్యిందన్నారు. సోనియా గాంధీ కి తెలంగాణ ప్రజలకు మొహం చూపించలేకే రాహుల్ గాంధీ వచ్చాడన్నారు. రాష్ట్ర మహిళలకు ప్రకటించిన 2500 రూపాయలే ఇవ్వలేక పోతున్న కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా మహిళలకు లక్ష రూపాయలు ఎలా ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పంటలు ఎండి రైతులు, త్రాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు పక్కన పెట్టీ రాజకీయాలు చేస్తున్నాడన్నారు.
అంతేకాకుండా..’ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపిస్తున్నారు.. వారి దృష్టి మరల్చేందుకు అవినీతి పై ఎంక్వైరీ అని కాలయాపన చేస్తున్నారు.. నిజంగా అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యిన అధికారులు సుప్రీం అనే పేరుని బయటపెట్టారు.. మరి బీఆర్ఎస్ లో ఆ సుప్రీం ఎవరో ఎందుకు బయట పెట్టడం లేదు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికారులను మాత్రమే బాధ్యులుగా చేసి.. అసలైన వారితో ఆర్థిక బేరాలు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం అవుతుంది.. గత ప్రభుత్వం నయీం ఆస్తుల విషయాన్ని బయటపెట్టలేదు.. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే నయీం ఆస్తుల వెలికి తీయాలి.. లిక్కర్ మాఫియా లో కవిత పాత్ర ఉంది కాబట్టే బెయిల్ కూడా రావడం లేదు.. ముఖ్యమంత్రి హోదాలో పని చేసిన కెసిఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం స్పందించక పోవడం సరీ కాదు.. స్వయంగా అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఒకటి రెండు సార్లు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఒప్పుకున్నాడు..’ అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.