రాష్ట్రపతి ప్రసంగం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు అనాలోచితంగా విమర్శలు చేస్తున్నారని, ఇండి కూటమి చీలికలతో కొట్టుమిట్టాడుతోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ఎంపీ దక్షిణ భారత ను విభజించాలని మాట్లాడుతున్నాడని, నారీ శక్తి కి ప్రోత్సాహించేలా ప్రసంగం ఉందన్నారు లక్ష్మణ్. అంతేకాకుండా.. మోడీకి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రసంశలను తట్టుకోలేక పోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ యాత్ర భారత్ జోడో చేస్తుంటే మరోవైపు కూటమి పార్టీ లు కాంగ్రెస్ చోడో అంటున్నారని, కూటమికి ఒక ఎజెండా లేదు నీతీ లేదన్నారు లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి, అబద్ధాలకు పోరు జరుగుతుందని, మోడీ హయాం లో అనేక కార్యక్రమాలు విజయవంతం గా నిర్వహించుకున్నామన్నారు. అసాధ్యమైన అనేక అంశాలను పార్లమెంట్ లో చట్టాలు చేయడం ద్వారా అమలులోకి తీసుకుని వచ్చామని, అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడే బడ్జెట్ ను నిర్మళా సీతారామన్ ప్రవేశపెట్టారన్నారు ఎంపీ కే.లక్ష్మణ్.
అభివృద్ధి, సంక్షేమంను సమతూకం తో బడ్జెట్ ప్రవేశపెట్టారని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి లక్ పతి పథకం ప్రవేశ పెట్టి 3కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ కేటాయించిందన్నారు. గత పదేళ్లుగా మహిళల అక్షరాస్యత శాతం 25 పెరిగిందని, బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది .. అది కాంగ్రెస్ గెలుపు కాదని, గ్యారెంటీ లు అమలు చేయకుండా దాట వేస్తోందన్నారు. ఓఆర్ఆర్, కాళేశ్వరం, ధరణి అవినీతి అని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి నేడు నోరు మెదపడం లేదని, సీబీఐ విచారణ అని గతం లో చెప్పిన రేవంత్ రెడ్డి మిన్నకుండి పోవడం దేనికి సంకేతమన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీ ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణా లో పదికి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలను గెలుస్తామన్నారు. వెనుకబడిన వర్గాల ను అవమాఝిచేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, అద్వానీ దేశం కోసం ధర్మం కోసం విలువలతో కూడిన రాజకీయాలను చేశారన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.