NTV Telugu Site icon

MP K.Laxman : ఓట్లు వేసి గెలిపించాక ప్రజలకు చుక్కలు చూపెడుతున్నారు

Laxman

Laxman

కాంగ్రెస్ పార్టీ హామీలపై ఆందోళనను వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీ పేరుతో మోసపూరిత హామీలు చెపుతోందని, “గ్యారంటీ” అనే పేరుతో ప్రజలను మోసపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మోసపూరిత హామీలతో ఓట్లు వేసుకుని గెలిచాక, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అనేక కారణాలు చెప్పి, నిర్లక్ష్యంగా చుక్కలు చూపిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ఈ గ్యారంటీలను అమలు చేయడం కాకుండా, “హైడ్రా” అనే పేరుతో ఇతర అంశాలకు దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజలు దగాపడినట్లు ఆయన పేర్కొంటూ, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. కాంగ్రెస్ కొత్త కొత్త డ్రామాలను తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే అవినీతికి, కుటుంబ రాజకీయాలకు, విచ్ఛిన్న శక్తులకు ఊతమిస్తారని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ఓట్ల కోసం హామీలు ఇచ్చి, అమలు చేయక పోవడం మాత్రం కాంగ్రెస్ ఫ్లాప్ షో అని ఆయన వ్యాఖ్యానించారు.

MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..

వరంగల్ లో సమావేశం పెట్టి హామీలు అమలు చేస్తామన్నారని, కానీ ఇంకా ఆరు గ్యారంటీలను అమలు చేయడం లేదని అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి విషమంగా మారుతోంది అని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి దృష్టి భ్రష్టం చేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న కూల్చివేతలపై డాక్టర్ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. పేద ప్రజల ఇళ్ళను ఎందుకు కూలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అనేక చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, పేద ప్రజల ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తిరుమల దేవస్థానం నియమాల ప్రకారం, ఇతర మతాల వ్యక్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. జగన్ పట్ల హిందువుల ఆత్మీయత లేకపోవడంపై ఆయన మండిపడుతున్నారు. ప్రతి వ్యక్తి తన విశ్వాసాలను పాటించాల్సిన అవసరం ఉందని, కానీ ఇతరుల విశ్వాసాలను గౌరవించాలి అని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తిరుమల పవిత్రమైన స్థలంగా కొనసాగాల్సిన అవసరం ఉందని, పవిత్రతను కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Siddaramaiah: రాజకీయ కుట్రలకు నా సతీమణి బాధితురాలు..