కేసీఆర్‌కు బీఆర్ఎస్ నేతలకు మహిళలను అవమానించడం అలవాటుగా మారిందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వంతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంటులో ప్రసంగిస్తే… దానిని బైకాట్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇది ముమ్మాటికి ఆదివాసీ మహిళలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పదవిని అలంకరిస్తే జీర్ణించుకోలేక బీఆర్ఎస్ ఇలా వ్యవహారించిందన్నారు. అంతేకాకుండా.. ‘ బీఆర్ఎస్ కు మహిళలంటేనే చిన్నచూపు… వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా వారిని అవమానించడమే పనిగా పెట్టుకుంది.. మహిళ అయిన తెలంగాణ గవర్నర్ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు రాష్ట్రపతిని అవమానించారు.
Also Read : Shakuntalam: సమంత శాకుంతలం వాయిదా..?
గవర్నర్ విషయంలో తాజాగా కేసీఆర్ సర్కార్ మరోసారి కోర్టు చివాట్లు తిన్నడు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నడిపించాలనీ చూశారు. కోర్టు చెంప చెళ్లుమనిపించడంతో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానిస్తున్నామంటున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక పండుగ వాతావరణంతో జరుపుకోవాలని. అలాంటిది ఏమి చేయకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించారు. రాష్ట్రపతి ప్రసంగం చాలా బాగుంది.. రాష్ట్రపతి ప్రసంగంలో నూట నలభై కోట్ల జనాభా ప్రజల అభివృద్ధి చూడవచ్చు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలాంటి విషయాల్లో కూడా భారత ప్రభుత్వం. ఆదివాసి ప్రాంతాలు ఆదివాసి పాఠశాలలు ఏర్పాటు చేశాము.
ఆత్మనిర్బర్ భారత్ గా ఆవిర్భవిస్తోందన్నారు… 140 కోట్ల భారతీయుల అభివృద్దే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకే గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వంలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగింది. వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్ గా నిలుస్తుంది.. మోదీ పాలనలో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.. యావత్ ప్రపంచం భారతదేశం పట్ల ఆశావహ దృక్పథంతో చూస్తోంది… ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైంది. పేదలు, గిరిజనులు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పనిచేస్తోంది. మూడు కోట్ల మందికి సొంత ఇళ్లు. ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటోంది. ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు వంటి పథకాలు తీసుకొచ్చింది.’ లక్ష్మణ్ అన్నారు.