కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా? అని తాము కూడా ఎదురుచూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి కూసుంటే.. అన్ని సమస్యలకూ పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మీరు ఏడు లక్షల కోట్లు చేసింది మీరే కాబట్టి.. ఏం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ జనం అధికారం నుంచి తరిమేశారు అనే అనుకోవడం లేదని.. జనం మమ్మల్ని మిస్ అయ్యారు అనే అనుకుంటున్నారన్నారు. తప్పేంటి.. ఒప్పేంటి అనే చర్చ లేదని.. కేసీఆర్ మాటలకే అంకితం.. చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఎమ్మె్ల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
READ MORE: IND vs NZ Final: భారత్ విక్టరీ కొట్టిన పిచ్ పైనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..
“ఎంపీ ఎన్నికల్లో గుండు సున్న. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నే చేయలేదు. కేసీఆర్ చేసిన తప్పులకు మేము మాటలు పడుతున్నాం. కాంట్రాక్టర్‌ల బిల్లులు పెండింగ్ పెట్టింది ఎవరు? మీరు చేసిన కర్మల వల్ల.. మేము ఢిల్లీకి పోతున్నాం. కార్ లోన్ కూడా 12 శాతం కి అప్పు తీసుకోము. రాష్ట్రం కోసం 12 శాతం వడ్డీతో రుణాలు తీసుకుంటారా? కాంట్రాక్టర్ లను థర్డ్ పార్టీ ప్రోత్సహించి పంపారు. మహేశ్వర్ రెడ్డి.. బీజేపీలో ఉనికి కోసం మాట్లాడుతున్నాడు. ఆయన బీజేపీ ఆఫిస్ లో మాట్లాడే అవకాశమే లేదని బయట మాట్లాడుకుంటున్నారు. ఆయన గురించి మాట్లాడి వెస్ట్” అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: IND vs NZ Final: భారత్ విక్టరీ కొట్టిన పిచ్ పైనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..