కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా? అని తాము కూడా ఎదురుచూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి కూసుంటే.. అన్ని సమస్యలకూ పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మీరు ఏడు లక్షల కోట్లు చేసింది మీరే కాబట్టి.. ఏం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ జనం అధికారం నుంచి తరిమేశారు అనే అనుకోవడం లేదని.. జనం మమ్మల్ని మిస్ అయ్యారు అనే అనుకుంటున్నారన్నారు. తప్పేంటి.. ఒప్పేంటి అనే చర్చ లేదని.. కేసీఆర్…
పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో ఐదుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు.
ఇంకో 15 రోజుల్లో గజ్వేల్ క్యాంపు ఆఫీస్ కి మాజీ సీఎం కేసీఆర్ వస్తారు.. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావట్లేదు.. అక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నది అని సర్వేలు చెబుతున్నాయి.. కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు.. పీఎసీఎస్ (PACS) చైర్మన్లు, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ లని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారు అని హరీష్ రావు అన్నారు.
Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ గౌరవించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో రాముడి ఆలయం వచ్చేదా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున యోగి ప్రచారం చేశారు. ఎంపీలోని పావై, అశోక్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
Congress: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోవిడ్ మహమ్మారి లాక్‌డౌన్‌ని ఆలస్యం చేశారని బీజేపీై ఆరోపణలు గుప్పించారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 2020లో మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత సీఎం శివరాజ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.