Site icon NTV Telugu

MP Balram Naik: కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలే.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు..!

Kcr Balaram Naik

Kcr Balaram Naik

MP Balram Naik: ములుగు జిల్లాలో జరిగిన ఇంద్ర మహిళ పట్టాల పంపిణీ కార్యక్రమం సభ రాజకీయ వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ములుగు ఎంపీ బలరాం నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని నా పరిధిలో ఉన్న రెండు మండలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీతక్కదే అని స్పష్టం చేశారు. అలాగే ప్రజలకు ప్రస్తుతం మార్కెట్‌ ధర రూ.60 ఉన్న సన్నబియ్యం ఉచితంగా అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ సామాజిక సంకల్పానికి నిదర్శనమని అన్నారు.

Read Also: KCR Enquiry: ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ.. BRK భవన్ వద్ద పెద్దెత్తున ఆందోళనలు..!

అయితే, ఈ సభలో ఎంపీ బలరాం నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గిరిజన యూనివర్సిటీకి ప్రహరీ గోడ నిర్మాణం కోసం నిధులు వస్తున్నాయి. మొత్తం 800 కోట్ల నిధులు తీసుకువస్తున్నాం అని అన్నారు. మారుమూల గ్రామాలకు బ్రిడ్జిలు నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అలాగే ఆయన హరితహారం పథకంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హరితహారం పేరుతో హరీష్ రావు 35 వేల కోట్ల రూపాయలు తినేశారు. నేను దీనిని నిరూపించగలను, హరీష్ రావు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. పైసలు తిన్నందువల్లే కేసుల్లో తిరుగుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

Read Also: KTR: కాళేశ్వరంను చిల్లర రాజకీయాలకోసం వాడుతున్నారు.. కేటీఆర్ బోల్డ్ కామెంట్స్..!

అకాగే తెలంగాణ ఏర్పాటుపై కూడా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్కడితో తెలంగాణ రాలేదు. సోనియా గాంధీ ఇచ్చారు. మేమందరం హౌస్ లో కొట్లాడితే తెలంగాణ వచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో మరో 25 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ను నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తోందని అన్నారు.

Exit mobile version