YS Viveka Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ జూన్ 5కి వాయిదా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. మరోవైపు ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఆయన ముందస్తు బెయిల్‌పై విచారణ సమయంలో హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళ సాధ్యం కాదని తెలిపింది తెలంగాణ హైకోర్టు.. వాదనలు విన్నా.. తీర్పు ఇవాళ ఇవ్వలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది.. అయితే, అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించండి అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి తరపు లాయర్‌కు సూచించింది.. మొదటి వెకేషన్ కోర్టులో విచారించేందుకు చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేసుకోవాలని సూచించింది హైకోర్టు సింగిల్ బెంచ్.. ఇక, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు సింగిల్ బెంచ్ ..
Read Also: Supreme Court: హంతకులకు ఎలా తెలిసింది..? అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి ప్రశ్నలు..
Also Read
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
మరోవైపు.. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేశారు ఎంపీ అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాదులు.. కానీ, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలకు నిరాకరించారు హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఇప్పటికిప్పుడు వాదనలు వినాలంటూ కోర్టు మీద ఒత్తిడి చేయొద్దు అని వ్యాఖ్యానించారు.. ఈ రోజు, రేపు, ఎల్లుండి వాదనలు వినాలని మీరు చెప్పడం సరికాదన్నారు సీజే.. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీజే.. కాగా, రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఇప్పటికే ప్రకటించారు.. వెకేషన్ తర్వాతే తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. కాగా, తెలంగాణ హైకోర్టుకు మే 1వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి.. అయితే, మే నెలలో నాలుగు రోజులు, జూన్ 1 వ తేదీన వెకేషన్ కోర్టులు పనిచేయనున్నాయి.. 5 వెకేషన్ 5 డివిజన్ బెంచ్‌లు, 5 సింగిల్ బెంచ్‌లు పనిచేస్తాయి.. అయితే, ముందస్తు బెయిల్‌పై ఈ రోజు తీర్పు వస్తుందని ఎదురుచూసిన ఎంపీ అవినాష్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. మరి, అవినాష్‌రెడ్డి వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయిస్తారా.. ముందుస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్‌గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!