క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- మోటరోలా–స్వరోవ్స్కీ భాగస్వామ్యం..
- IFA 2026లో కొత్త ప్రత్యేక ఎడిషన్ ఫోల్డబుల్ ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Razr 70 Swarovski Edition: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫ్యాషన్, టెక్నాలజీని కలిపి కొత్తగా చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది మోటరోలా (Motorola) సంస్థ. ప్రముఖ క్రిస్టల్ బ్రాండ్ స్వరోవ్స్కీ (Swarovski)తో మరోసారి చేతులు కలిపి.. కొత్త రేజర్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానుంది. అధికారికంగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. సెప్టెంబర్ ప్రారంభంలో జర్మనీలోని బెర్లిన్‌లో జరగనున్న ఐఎఫ్ఏ 2026 వేదికగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.
మోటరోలా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన టీజర్లో ఫోన్ వెనుక భాగాన్ని మాత్రమే చూపించింది. నలుపు రంగు బ్యాక్ ప్యానెల్‌పై డైమండ్ ఆకారపు టెక్స్చర్తో పాటు అక్కడక్కడా క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి. ఈ డిజైన్ ఇప్పటికే ఆన్లైన్లో లీకైన చిత్రాలకు దగ్గరగా ఉన్నాయి. ఈ ఫోన్ రేజర్ 70 స్వరోవ్స్కీ ఎడిషన్‌గా రానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మోటరోలా రేజర్ 60 స్వరోవ్స్కీ ఎడిషన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రేజర్ 70కు స్వరోవ్స్కీ డిజైన్‌ను తీసుకరానుంది. గత నెల ప్రారంభంలో లీకైన రెండర్లు కూడా ఈ ఫోన్ డిజైన్‌పై కీలక వివరాలను వెల్లడించాయి. క్విల్టెడ్ డిజైన్‌తో కూడిన బ్లాక్ బ్యాక్ ప్యానెల్‌పై డజన్ల కొద్దీ చిన్న క్రిస్టల్స్, హింజ్ ప్రాంతంలో పెద్ద క్రిస్టల్, బయటి డిస్ప్లే కింద మరికొన్ని క్రిస్టల్ డిజైన్లు ఉన్నట్లు ఆ ఫొటోల్లో కనిపించింది.
Also Read
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
రేజర్ 60 స్వరోవ్స్కీ ఎడిషన్‌తో పోలిస్తే కొత్త ఫోన్ డిజైన్ కొంత సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించే అవకాశం ఉంది. నలుపు రంగు బ్యాక్ ప్యానెల్‌కు మెరిసే క్రిస్టల్స్‌ను జోడించడం ద్వారా ఫ్యాషన్ లుక్‌ను అందించనుంది. అంటే సాధారణ ఫోల్డబుల్ ఫోన్‌కు భిన్నంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ప్రీమియం ఫ్యాషన్ యాక్సెసరీలా మోటరోలా రూపొందిస్తున్నారు. హార్డ్‌వేర్ పరంగా రేజర్ 70 స్వరోవ్స్కీ ఎడిషన్‌లో స్టాండర్డ్ రేజర్ 70లో ఉన్న ఫీచర్లే ఉండనున్నాయి.
ఇందులో 6.9 అంగుళాల ఇంటర్నల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 4,500mah బ్యాటరీ ఉండనున్నాయి. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో రెండు 50MP కెమెరాలు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే ఫోన్ వెలుపలి భాగంలో 3.6 అంగుళాల కవర్ డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే వెనుక కెమెరాల చుట్టూ విస్తరించే విధంగా రేజర్ సిరీస్ ప్రత్యేక డిజైన్‌ను కొనసాగించనుంది. లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌తో పాటు పారదర్శక ప్రొటెక్టివ్ కేస్, యూఎస్బీ టైప్-సీ కేబుల్, 33 వాట్ల ఛార్జర్‌ను బాక్స్‌లో అందించే అవకాశం ఉంది. స్టాండర్డ్ మోడల్లో ఉన్న 30 వాట్ల వైర్డ్ ఛార్జింగ్‌కు బదులుగా ప్రత్యేక ఎడిషన్‌లో 33 వాట్ల ఛార్జింగ్ ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కొత్త మోడల్ ధర కూడా దాదాపు 1,000 డాలర్ల పరిధిలో ఉండొచ్చని అంచనా. ఐఎఫ్ఏ 2026లో మోటరోలా ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Sparkling brilliance ✨
Coming soon. #IFA2026 pic.twitter.com/DDtG9YgKUv— motorola (@Moto) August 28, 2026
తాజావార్తలు
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!