Discount On Mobile: తొలి సేల్‌లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మార్కెట్లోకి మోటరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘మోటరోలా ఎడ్జ్ 70 మాక్స్’ ను విడుదల చేసింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ (8GB+256GB) ధర రూ.54,999 కాగా, టాప్-ఎండ్ వేరియంట్ (12GB+256GB) ధర రూ.59,999 గా ఉంది. జూలై 20 నుండి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక స్టోర్లలో లభించే ఈ ఫోన్‌పై హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, అలాగే రూ.5,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీనితో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.44,999 కి తగ్గుతుంది. ఇది పాంటోన్ ఆక్వా గ్రే, పాంటోన్ డార్క్ షాడో, పాంటోన్ ఐస్ మెల్ట్ కలర్లలో అందుబాటులో ఉంటుంది.
ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ మరియు తడి వేళ్లతో పనిచేసే ‘వాటర్ టచ్’ ఫీచర్ కలిగిన 6.8-ఇంచుల QHD+ ఎక్స్ట్రీమ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్, IP68 + IP69 రేటింగ్‌తో రూపొందిన ఈ ఫోన్, లేటెస్ట్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్, వేడిని తగ్గించడానికి భారీ వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.
Also Read
ఆండ్రాయిడ్ 16 ఆధారిత హాలో యూఐ పై నడిచే ఈ ఫోన్‌కు 3 సంవత్సరాల ఓఎస్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి. కెమెరాల పరంగా, OIS, సోనీ LYT-710 సెన్సార్ కలిగిన 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 90W వైర్డ్, 25W మాగ్నెటిక్ వైర్లెస్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 7100mAh బ్యాటరీని అందించారు. 8.29 mm మందం, 221 గ్రాముల బరువుతో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!