Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్నబ్ తుఫాన్ భారతదేశ తూర్పు తీరంలో తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చి, వేలాది మంది జీవనోపాధిపై దెబ్బకొట్టింది. ఈ విపత్తుకు స్పందిస్తూ రిలయన్స్ ఫౌండేషన్ తన ‘వి కేర్’ తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొట్టుకుపోయిన 180కి పైగా పడవలను వెలికితీసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ తుఫాన్ కారణంగా జిల్లాలోని అల్లావరం మండలం ఓడలరేవు, సఖినేటిపల్లి ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలలో మత్స్యకార వర్గాల జీవనోపాధి దెబ్బతింది.
ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు 186 చేపల వేట పడవలు లంగరు స్థానాల నుంచి కొట్టుకుపోయాయి. వీటిలో అనేక పడవలు కాలువలు, బురద ప్రాంతాలు, సమీప ల్యాండింగ్ స్థలాలలో చిక్కుకున్నాయి. కొన్ని పడవలు పాక్షికంగా లేదా పూర్తిగా మునిగిపోగా, మరికొన్ని ఒండ్రులో ఇరుక్కుపోయాయి, ఇంకొన్ని ఒకదానిపై ఒకటి పడిపోయాయి. సుమారు 5 నుంచి 10 టన్నుల బరువున్న ఈ పడవలు సరియైన దారి లేని బురద ప్రాంతాలలో ఉండటంతో చేతులతో వెలికితీయడం కష్టంగా, ప్రమాదకరంగా మారింది.
Also Read
- Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
- DGP CV Anand: "పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం".. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
- Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..
దీంతో రిలయన్స్ ఫౌండేషన్ నిపుణులు, బృందాలు.. అల్లావరం మండల మత్స్యశాఖ, ప్రభుత్వ అధికారులతో కలిసి సరైన క్రేన్లు, యాంత్రిక పరికరాల ద్వారా ప్రభావితమైన పడవలను సురక్షితంగా వెలికితీయడానికి చర్యలు చేపట్టాయి. స్థానిక మత్స్యకారులతో కలిసి పడవల లొకేషన్లను గుర్తించి, క్రేన్ ఆపరేటర్ల సహాయంతో ప్రత్యేక భద్రతా ప్రమాణాలకు లోబడి ప్రణాళికాబద్ధంగా వాటిని యథాస్థానానికి చేరుస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలోని దాదాపు 10,000 మంది మత్స్యకారులకు నేరుగా, పరోక్షంగా లబ్ధి చేకూరనుంది. పడవలను సురక్షితంగా వెలికితీయడం వల్ల నీటిలోనే ఉండటం వలన జరిగే అదనపు నష్టం తగ్గడమే కాకుండా, మరమ్మతు అంచనా వేసుకోవడానికి యజమానులకు వీలు కలుగుతుంది. దీని ద్వారా మరమ్మతులు పూర్తి చేసుకుని మత్స్యకార కుటుంబాలు త్వరగా తమ వేటను పునఃప్రారంభించవచ్చు. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ఎల్లప్పుడూ ముందుండే రిలయన్స్ ఫౌండేషన్, భవిష్యత్తులో కూడా సహాయ, పునరావాస చర్యల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!