Buy Motorola Edge 40 Neo 5G Smartphone Rs 22999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లోకి వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరంభం కాకముందే ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో ఇటీవల భారతదేశంలో రిలీజ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది.
Motorola Edge 40 Neo Offers:
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్ (MOTOROLA Edge 40 Neo Caneel Bay, 256 GB, 12 GB RAM) అసలు ధర రూ. 29,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 23 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో ఎడ్జ్ 40 నియో రూ. 22,999కి మీకు అందుబాటులో ఉంది. అంటే మీరు రూ. 7,000 ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌పై 10 శాతం బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో ఎడ్జ్ 40 నియోను మరింత తక్కువ ధరకు మీ సొంతం అవుతుంది.
Motorola Edge 40 Neo Launch Date:
ఎడ్జ్ 40 నియోని గత ఏప్రిల్ నెలలోనే మోటోరోలా పరిచయం చేసింది. మోటోరోలా ఎడ్జ్ 40, మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన మోటోరోలా.. ఎడ్జ్ 40 నియోను మాత్రం విడుదల చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 21న మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎడ్జ్ 40 నియోకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో స్టాక్ త్వరలోనే అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కొనేసుకుంటే బెటర్.
Also Read: UP Police: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతిపై పోలీసు అత్యాచారం!
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్పెసిఫికేషన్స్ (Motorola Edge 40 Neo Specs):
# 6.5 ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
# డైమెన్సిటీ 7030 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 13-ఆధారిత మైయూఎక్స్ ఓఎస్
# 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్
# 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 5,000ఎంఏహెచ్ బ్యాటరీ (68 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)