నవ మాసాలు మోసి కన్న బిడ్డను తన చేతులతో కడతేర్చింది. మైలార్ దేవ్ పల్లి ఆలీ నగర్ లో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 15 రోజుల పసికందుని తల్లి చంపేసింది. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసింది. స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడింది.