NTV Telugu Site icon

Vikarabad District: కన్న కొడుకునే దారుణంగా హత్య చేసిన తల్లి.. సహకరించిన భార్య..

Murder In Telangana

Murder In Telangana

ఇంటి ముందు నిద్రిస్తున్న కొడుకును ఇనుప రాడ్డుతో కొట్టి హత్యకు ఒడిగట్టింది తల్లి హత్యకు భార్య కూడా సహకరించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మొదట అనుమానాస్పద మృతిగా వందతులు వచ్చినా.. దారుణ హత్య చేశారని పుకార్లు వినిపించాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. తల్లి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. మంగళవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రించాడు. బుధవారం తెల్లవారు జామున వెంకటేష్‌ రక్తపు మడుగులో శవమై కనిపించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

READ MORE: Miss World: నా మిస్ వరల్డ్ ప్రయాణం భారత్‌లోనే ప్రారంభం: క్రిస్టినా పిస్కోవా

గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డి.ఎస్.పి బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్‌, ఎస్ఐ శ్రీధర్ రెడ్డితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మృతుని వెంకటేష్‌ను అతని తల్లి లక్ష్మమ్మ, భార్య సబితాలే హత్యచేసి ఉంటారని గ్రామంలో పుకార్లు వినిపించాయి. మద్యానికి బానిసైన వెంకటేష్‌ నిత్యం వేధింపులకు పాల్పడుతుండటంతో ఈ ఘాతునికి పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఆరోపణలతో పాటు మృతుడి తమ్ముడు శ్రీనివాస్, తన అన్న మృతిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేశాడు. మరోవైపు పోలీసులు తల్లి, భార్యలను అదుపులోకి తీసుకొని విచారించారు. వెంకటేష్ రోజు మద్యం తాగి వచ్చి వేధించేవాడని వేధింపులు ఎక్కువ కావడంతో వెంకటేష్ ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నారు. తల్లి భార్య పథకం ప్రకారం ఇంటి ముందు నిద్రిస్తున్న వెంకటేష్ తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావం జరిగి మరణించాడని పోలీసులు తెలిపారు. హత్యకు ఒడిగట్టిన తల్లి, భార్యపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

READ MORE: MS Dhoni: ఐపీఎల్‌లో ధోని ఉన్నన్ని రోజులు స్టేడియాలు పసుపెక్కాల్సిందే..