మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ దాసరి అంకన్న, హరిచంద్ర పోలీసులకు చిక్కారు. సత్యసాయి జిల్లా తనకల్లు ( మం ) చెక్కవారిపల్లి అటవీప్రాంతంలో పాణ్యం, సి.సి.ఎస్. కదిరి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. డ్రోన్లు, స్థానికుల సహకారంతో వ్యూహాత్మకంగా పట్టుకున్నారు పోలీసులు. బొగ్గులు కాల్చుకుని జీవనం సాగించేవారి ముసుగులో క్రిమినల్స్ షెల్టర్ తీసుకున్నట్లు గుర్తించారు. దాసరి అంకన్న , హరిచంద్రలపై గుంటూరు, పల్నాడు నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. శాంతిరామ్ జనరల్ ఆసుపత్రి, రైతు నగర్, రాయమాలపురం గోస్పాడు ప్రాంతాల్లో జరిగిన దోపిడీ కేసుల్లో దాసరి అంకన్న హరిచంద్ర నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.
Also Read:Sri sathya sai district: కరుడుగట్టిన నేరస్తుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు!
దాసరి అంకన్న స్వగ్రామం గడివేముల మండలం కరిమద్దెల, హరిచంద్ర స్వగ్రామం పాణ్యం చెంచు కాలనీ, దాసరి అంకన్న పై 22, హరిచంద్రపై 16 దోపిడి దొంగతనం రేప్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. 4 నెలల క్రితం పోలీసులు నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్ లో దాసరి అంకన్న తప్పించుకున్నట్లు తెలిపారు. పదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపిస్తున్నాడు దాసరి వెంకన్న. పోలీసులు దాసరి అంకన్న , హరిచంద్రలను విచారిస్తున్నట్లు తెలిపారు.