టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బంధువైన కరీంనగర్‌లోని న్యాయవాది సింహయాజీకి విమాన టిక్కెట్టు బుక్ చేసినట్లు తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ కేసులో నిందితులు అక్టోబర్ 26న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. సిట్ విచారణకు సంబంధించిన సమాచారం ప్రకారం.. కరీంనగర్‌లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది, అరెస్టయిన మరో నిందితుడు నంద కుమార్‌తో కూడా అక్టోబర్ 14న మాట్లాడారని, ఆ తర్వాత అక్టోబరు 26న సింహయాజీకి టికెట్ బుక్ చేశారని తెలిసింది. కాల్ డేటా రికార్డులను సేకరించిన పోలీసులకు, ఈ కోవర్ట్ ఆపరేషన్ గురించి మరిన్ని ఆశ్చర్యకరమైన వివరాలు గుర్తించారు.
Also Read :Rajiv Gandhi Assassination Case: జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హంతకులు.. తమిళులకు థాంక్స్ తెలిపిన నళిని
మరో పరిణామం ఏమిటంటే, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్లాన్‌లు వేసిన స్టింగ్ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ బెదిరింపు కాల్స్‌పై ఎమ్మెల్యేలు త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై బీజేపీ తీవ్రంగా ఖండించింది. తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించింది.
Also Read : S Jaishankar: ఉక్రెయిన్ మంత్రితో సమావేశం అయిన జైశంకర్.. యుద్ధం ముగించే మార్గాలపై చర్చ