Mohsin Naqvi: “మేము భారత్‌తో ఆడటానికి కారణం ఆయనే”.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohsin Naqvi: ఇటీవల జరిగిన భారత-పాకిస్థాన్ మ్యాచ్ ఏ మేరకు హాట్ టాపిక్‌గా మారిందో తెలిసిన విషయమే. పాకిస్థాన్ భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు ముందు ఒప్పుకోలేదు. అనేక మీటింగ్స్ తరువాత ఎట్టకేలకు దిగి వచ్చి మ్యాచ్ ఆడింది. అంతే కాదు.. ఎంతో బిల్డప్ కొట్టిన పాకిస్థాన్ చివరకు భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అయితే.. ఈ అంశంపై తాజాగా పీబీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ యూటర్న్ వెనుక అసలు కారణం అనుర కుమార దిసానాయకే (Anura Kumara Dissanayake ) అని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 9న పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రతినిధులు కలిసి దీర్ఘ చర్చలు జరిపారు. ఈ చర్చలతో పాటు శ్రీలంక అధ్యక్షుడు స్వయంగా జోక్యం చేసుకుని పాకిస్థాన్ ప్రధానికి ఫోన్ చేసి మ్యాచ్ ఆడేలా అనుమతించాలని కోరారు. ఆ ఫోన్ కాల్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నఖ్వీ తెలిపారు. ప్రధాని షరీఫ్ వెంటనే తనను సంప్రదించి “ఇక ఎలాంటి సమస్య లేదు, మ్యాచ్ ఆడాలి” అని స్పష్టంగా చెప్పారని వెల్లడించారు.
READ MORE: Harish Rao: దళిత నాయకుడు బాల్క సుమన్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం..
Also Read
- Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
- SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్‌ను..!
- FIFA World Cup: సెనెగల్పై 'కిలియన్ ఎంబాపే' డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
మ్యాచ్ అనంతరం నఖ్వీ, శ్రీలంక అధ్యక్షుడిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “నిన్నటి మ్యాచ్‌లో నిజమైన హీరో మీరు. రెండు బిలియన్ మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను ఆస్వాదించారు. అది మీ వల్లే సాధ్యమైంది” అని అన్నారు. అంతా సవ్యంగా జరిగి మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ, పాకిస్థాన్‌కు ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం (R. Premadasa Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ బలమైన ప్రదర్శన చేసింది. ఇషాన్ కిషన్ అద్భుతంగా 77 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. కఠినమైన పిచ్‌పై భారత్ మొత్తం 175 పరుగులు చేసింది. తర్వాత బౌలింగ్‌లోనూ భారత జట్టు అదరగొట్టింది. పాకిస్థాన్ బ్యాటర్లు వరుసగా ఔటవుతూ మ్యాచ్‌ను చేతులారా కోల్పోయారు. ఈ ఓటమి కారణంగా పాకిస్థాన్‌కు తర్వాతి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
READ MORE: Bhagyashri Borse: సిద్ధూతో జతకట్టబోతున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ సినిమా!
తాజావార్తలు
-
Tamannaah Bhatia : షారూఖ్ నుంచి షాకింగ్ ఆఫర్… ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసిన తమన్నా
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Microsoft Surface Pro: OLED డిస్ప్లే, 16GB RAM, ప్రీమియం ఫీచర్లతో.. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ల్యాప్‌టాప్ విడుదల
-
SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్‌ను..!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!