Tamannaah Bhatia : షారూఖ్ నుంచి షాకింగ్ ఆఫర్… ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసిన తమన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah Bhatia : సినీ పరిశ్రమలో అవకాశాలు ఎన్నో వస్తుంటాయి. కానీ కొన్ని ఆఫర్లు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ఆ అవకాశం స్వయంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తే ఆ క్షణం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి అరుదైన అనుభవాన్ని తాజాగా నటి తమన్నా భాటియా అభిమానులతో పంచుకున్నారు. షారుఖ్ ఖాన్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ నిర్వహించిన వ్లాగ్‌లో పాల్గొన్న తమన్నా భాటియా, షారుఖ్ ఖాన్‌తో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవ అసాధారణమని పేర్కొంటూ, షారుఖ్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరని అన్నారు. ఆయన కేవలం స్టార్ హీరో మాత్రమే కాదని, తనతో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరిని గౌరవించే గొప్ప మనిషి అని తమన్నా ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటనను కూడా ఆమె వెల్లడించారు. షారుఖ్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్’లోని ‘గఫూర్’ పాటలో నటించాలంటూ స్వయంగా ఫోన్ చేసి అడిగారని చెప్పారు. ఆ కాల్ తనకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని తమన్నా పేర్కొన్నారు. నువ్వు ఈ పాట చేయగలవా? అని ఎంతో సాదాసీదాగా అడిగారని, ఆయనలాంటి వ్యక్తి అడిగిన తర్వాత రెండో ఆలోచన లేకుండా వెంటనే అంగీకరించానని ఆమె చెప్పారు. పరిశ్రమకు ఆయన చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని ఆ అవకాశాన్ని గౌరవంగా స్వీకరించినట్లు వివరించారు.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తమన్నా, షారుఖ్ ఖాన్ గతంలో కొన్ని ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కలిసి కనిపించినప్పటికీ, ఇప్పటివరకు ఒక ఫీచర్ ఫిల్మ్‌లో మాత్రం కలిసి నటించలేదు. అందుకే ఈ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. వారి స్క్రీన్ ప్రెజెన్స్, స్టార్ ఇమేజ్ దృష్ట్యా భవిష్యత్తులో అలాంటి ప్రాజెక్ట్ వస్తే ప్రేక్షకులు కూడా ఆదరించే అవకాశం ఉంది. ఇక కెరీర్ పరంగా చూస్తే, షారుఖ్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కుమార్తె సుహానా ఖాన్‌తో తొలిసారి ప్రధాన పాత్రల్లో కలిసి కనిపించనున్నారు. దీపికా పడుకోన్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు తమన్నా భాటియా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న జానపద థ్రిల్లర్ ‘వ్వాన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ విడుదలకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?