Site icon NTV Telugu

Mohsin Naqvi: యుద్ధం మీకు గర్వకారణమైతే.. పీఎం మోడీ ఆపరేషన్ సింధూర్ పోస్ట్‌పై స్పందించిన మొహ్సిన్ నఖ్వీ

Nakvi

Nakvi

ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ పాక్ పై విజయ దుంధుబి మోగించిన తర్వాత టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్, ఆ దేశ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. దీంతో నఖ్వీ అంతర్జాతీయ వేదికపై అవమానాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు భారత్ క్రీడా స్ఫూర్తిని అవమానించిందని ఆరోపిస్తున్నారు. ఆట తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందన పోస్ట్‌పై మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో నఖ్వీ స్పందించారు. మోడీపై ఆయన చేసిన తాజా ప్రకటన వివాదానికి దారితీసింది.

Also Read:Bathukamma After Dasara: ఇక్కడ దసరా తర్వాతనే సద్దుల బతుకమ్మ.. ఎక్కడో తెలుసా?

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ప్రస్తుత ACC అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ స్పందిస్తూ, “యుద్ధం మీ గర్వానికి కొలమానమైతే, పాకిస్తాన్ చేతిలో మీ అవమానకరమైన ఓటమిని చరిత్ర ఇప్పటికే నమోదు చేసింది. ఏ క్రికెట్ మ్యాచ్ కూడా చరిత్ర సత్యాన్ని తిరిగి వ్రాయలేదు. యుద్ధాన్ని క్రీడల్లోకి లాగడం మీ నిరాశను బహిర్గతం చేస్తుంది, క్రీడా స్ఫూర్తికి అవమానం.” అని తెలిపాడు.

Also Read:Telangana: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగింపు.. క్రాస్‌ ఎగ్జామినేషన్ కీలక దశ

ఫైనల్లో పాకిస్తాన్ పై భారతదేశం 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత, PM మోడీ X లో పోస్ట్ చేస్తూ, “క్రికెట్ మైదానంలో ఆపరేషన్ సిందూర్. ఫలితం అదే. భారతదేశం గెలిచింది. అందరు భారతీయ క్రికెటర్లకు అభినందనలు” అని రాసుకొచ్చారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నాశనం చేసిన ఆపరేషన్ సిందూర్ గురించి PM మోడీ ప్రస్తావించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహించింది.

Exit mobile version