Site icon NTV Telugu

Mohammad Amir: పాకిస్థాన్ మాజీ పేసర్ ‘బలుపు’ మాటలు.. టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరదంటూ అక్కసు!

Mohammad Amir

Mohammad Amir

Mohammad Amir: పాకిస్థాన్ ప్లేయర్స్ బలుపు మాటల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా టీమిండియాపై మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మరోసారి విషం కక్కాడు. టీ20 వరల్డ్ కప్ సేమీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించదని ఆమిర్ పునరుద్ఘాటించాడు. అంతకు ముందు కూడా భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మపై నెటిగివ్ కామెంట్స్ చేశాడు. అభిషేక్‌ను స్లాగర్ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ‘హార్నా మనా హై’ అనే టాక్ షోలో పాల్గొన్న ఆమిర్.. భారత్ సెమీస్ చేరదనే తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టాడు. భారత జట్టును తాను విమర్శించడం లేదన్నాడు. టీమిండియా బ్యాటింగ్ తీరు, జట్టు సమష్టిగా ఆడుతున్న విధానాన్ని బట్టే తాను ఈ అంచనాకు వచ్చానని ఆమిర్ వివరించాడు. తన దృష్టిలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు మెరుగ్గా ఉన్నాయని, అందుకే సెమీ ఫైనల్‌కు భారత్‌ చేరదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

READ MORE: CM Chandrababu: పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

“నా అభిప్రాయాన్ని మీరు ఇష్టపడినా, ద్వేషించినా అది మీ ఇష్టం. భారత్ ఫైనల్ చేరుతుందని నన్ను బలవంతంగా చెప్పమంటారా? వాళ్ళు ఫైనల్ చేరినా, చేరకపోయినా నాకేంటి సంబంధం? వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు పూర్తి స్థాయి క్రికెట్ ఆడుతున్నాయి కాబట్టి అవే సెమీస్ చేరుకుంటాయని నేను భావిస్తున్నాను. ఒకవేళ భారత్ ఫైనల్స్‌కు చేరితే సంతోషమే” అని ఆమిర్ తనదైన శైలిలో స్పందించాడు. భారత్ ఉన్న గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు తాను ఎందుకు మద్దతు ఇస్తున్నానో గతంలో విడుదల చేసిన ఓ వీడియోలో కూడా ఆమిర్ వివరించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మినహా మిగతా అన్ని మ్యాచ్‌లలోనూ భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిందని తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఆడుతున్న తీరు చూస్తుంటే ఏ జట్టునైనా ఓడించగలవని పేర్కొన్నాడు.

READ MORE: IND vs SA Super 8: టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాప్రికాపై భారత్‌ డామినేషన్.. 2007 నుంచి మ్యాచ్‌ల ఫలితాలు ఇలా!

Exit mobile version