England All-Rounder Moeen Ali Announced his Retirement from Test Cricket: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తన టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ 2023లో భాగంగా లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన ఐదవ టెస్టు అనంతరం అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఓవల్ టెస్ట్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన అతడు ఐదవ టెస్ట్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతామని చెప్పాడు. అయితే అలీ టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఇది రెండోసారి. ఇదివరకు 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
2021లో మొయిన్ అలీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా యాషెస్ 2023కి దూరమయ్యాడు. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ మాట్లాడిన అనంతరం మెయిన్ అలీ తన టెస్టు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. యాషెస్ 2023తో ఇంగ్లాండ్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ.. అద్భుతంగా రాణించాడు. యాషెస్ 2023లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అలీ.. 180 పరుగులు, 9 వికెట్లు పడగొట్టాడు. యాషెస్ 2023 అనంతరం మళ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు.
Also Read: Delhi Air Quality: ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ.. గత 4 సంవత్సరాలలో ఇదే మొదటిసారి!
ఐదవ టెస్ట్ మ్యాచ్ అనంతరం మొయిన్ అలీ మాట్లాడుతూ… రిటైర్మెంట్ గురించి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాకు మళ్లీ మెసేజ్ చేస్తే వెంటనే డిలీట్ చేస్తానని సరదాగా చెప్పాడు. ‘నేను వచ్చిన పని అయిపొయింది. యాషెస్ 2023ని బాగా ఎంజాయ్ చేశా. చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. బెన్ స్టోక్స్ రీ ఎంట్రీ ఇవ్వమని అడిగినప్పుడు నో చెప్పా. ఎందకంటే నేను ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై గొప్పగా ఆడలేదు. స్టోక్స్ అండగా నిలిచాడు. నువ్ అద్భుతంగా రాణించగలవని నమ్ముతున్నానని నాతొ అన్నాడు. అప్పుడు మళ్లీ ఆడేందుకు ఒప్పుకున్నా’ అని అలీ తెలిపాడు.
జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మొయిన్ అలీ చెప్పాడు. ఇంగ్లండ్ వంటి జట్టుకు జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందన్నాడు. వన్డే, టీ20 జట్టులో మొయిన్ అలీ కొనసాగనున్నాడు. అలీ 68 టెస్టుల్లో 3094 రన్స్ చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 204 వికెట్స్ పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 6/53.
Also Read: IND vs WI: భారత్‌తో టీ20 సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు ఆయేగా