Amit Shah: మయన్మార్ బోర్డర్లో 1,643 కిలోమీటర్ల కంచె ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మయన్మార్ సరిహద్దు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్- మయన్మార్ల సరిహద్దులో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచెను (Fencing) నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. కట్టుదిట్టమైన నిఘాను సరిహద్దు వెంబడి ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సరిహద్దుల్లో భద్రతకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
- Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
ఇరు దేశాల మధ్య సరిహద్దును పూర్తిగా కవర్ చేస్తూ 1,643 కిమీ పొడవునా కంచెను నిర్మిస్తున్నట్లు అమత్ షా వెల్లడించారు. మణిపుర్‌లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల మేర కంచె వేశారని… హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మణిపుర్లో సుమారు 20 కి.మీ. మేర పనులకు కూడా ఆమోదం లభించిందని.. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని అమిత్ షా ట్వీట్ ద్వారా వెల్లడించారు.
సరిహద్దుల్లో ఏఏ రాష్ట్రాలంటే..
ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే ఈ మధ్య ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మణిపుర్ సంక్షోభం, మయన్మార్‌లో అంతర్యుద్ధంతో పరిస్థితులు ప్రభావితమయ్యాయి. ఇలాంటివి అరికట్టేందుకు ఆ దేశ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు.
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!