మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఓ మహిళ విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల దృష్టికి తీసుకెళ్లారు..
మయన్మార్ సరిహద్దు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్- మయన్మార్‌ల సరిహద్దులో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచెను (Fencing) నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు.
Amit Shah: భారతదేశంలోకి మయన్మార్ నుంచి స్వేచ్ఛగా ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు మయన్మార్ సరిహద్దుల్లో కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మయన్మార్‌లో జాతుల సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు అక్కడి సైనికులు భారత్ లోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌తో భారత్ సరిహద్దుల్ని బంగ్లాదేశ్‌తో సమానంగా రక్షించాలని అస్సాం పోలీస్ కమాండో పాసింగ్ పరేడ్‌లో అమిత్ షా అన్నారు.
Farmers Arrested : అక్రమ గసగసాల సాగుపై మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది.