TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ సామ్రాజ్యం ఇప్పుడు నిలువునా కూలిపోతోంది. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని, ఎమ్మెల్యేలు, చివరకు పార్లమెంట్ సభ్యుల (MPs) వరకు అందరూ ఆమెపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ ఏడాది మే 4న జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, టీఎంసీని ప్రతిపక్షంలోకి నెట్టేసినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కౌన్సిలర్లు ప్రజల తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటూ పదవులకు రాజీనామాలు చేస్తుండగా, ఎంపీలు సైతం మమతా బెనర్జీని వీడి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమిలో చేరడానికి సిద్ధమవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో అన్ని స్థాయిల్లోనూ నియంత్రణ తప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 101 మందికి పైగా కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అసెంబ్లీ స్థాయిలో రెబెల్ లీడర్ రితబ్రతా బెనర్జీ నేతృత్వంలోని క్యాంప్ వైపు ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపగా, పార్లమెంట్ స్థాయిలో లోక్‌సభలో కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో 20 మంది ఎంపీలు ఎన్డీఏ వైపు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. రాజ్యసభలో సైతం వారం వ్యవధిలోనే ఇద్దరు కీలక ఎంపీలు రాజీనామా చేశారు.
టీఎంసీలో మార్పులకు రెండు ప్రధాన కారణాలు..!
టీఎంసీలో ఈ పెను మార్పులకు రెండే రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గత 15 ఏళ్ల టీఎంసీ అవినీతి, అరాచక పాలనపై ప్రజల్లో గూడుకట్టుకున్న తీవ్ర ఆగ్రహం నేడు వీధుల్లో బద్దలవుతుండటం. రెండు, తిరుగుబాటు చేయాలనుకునే నాయకులకు బీజేపీ అగ్రనాయకత్వం పూర్తి అండదండలు అందిస్తూ అనుకూల వాతావరణాన్ని సృష్టించడం. పార్టీని వీడుతున్న నేతలు పైకి అవినీతిని, మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఇస్తున్న మితిమీరిన ప్రాధాన్యతను తప్పుబడుతున్నప్పటికీ, దీని వెనుక అసలు కారణం వారి రాజకీయ మనుగడ (Self-preservation) మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ వీధుల్లో ఇప్పుడు టీఎంసీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ వంటి అగ్రనేతలను సైతం జనం రోడ్లపై “చోర్.. చోర్ (దొంగ.. దొంగ)” అంటూ నినాదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పలుచోట్ల వారిపై గుడ్లు, టమోటాలు, రాళ్లతో దాడులు జరుగుతున్నాయి. మే 30న సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీపై, మే 31న హుగ్లీలో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై, జూన్ 6న ఎమ్మెల్యే మదన్ మిత్ర కాన్వాయ్‌పై ప్రజలు దాడులు చేశారు. ఈ ప్రజా ఆగ్రహానికి భయపడి జూన్ 7న తృణమూల్ భవన్లో జరగాల్సిన కీలక సమావేశాన్ని సైతం రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
Also Read
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
మరోవైపు, అధికార రక్షణ పోవడంతో స్థానిక లీడర్ల అవినీతి లీలలు బయటపడి వరుస అరెస్టులు సాగుతున్నాయి. తోప్సియా ఎమ్మెల్యే జావేద్ ఖాన్, ఆయన కుమారుడు నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలు ఇందుకు ఉదాహరణ. ఇలాంటి తరుణంలో తాము కూడా నియోజకవర్గాల్లోకి వెళ్తే ప్రజల చేతిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల నుంచి తప్పించుకోవచ్చని ఎంపీలు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపితే తమకు భద్రతతో పాటు కేసుల నుంచి రక్షణ లభిస్తుందనేది వారి ఆశ. పైగా, 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మమతా బెనర్జీ అండతో సాధ్యం కాదని ముందే గ్రహించారు. ఈ తిరుగుబాటు ఊరికే జరగడం లేదు, దీని వెనుక బీజేపీ పూర్తి వ్యూహాత్మక మద్దతు ఉంది. లోక్‌సభలో టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీలలో 20 మంది తిరుగుబాటు దారులు కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాము ఎన్డీఏ కూటమికి మద్దతిస్తూ ప్రత్యేక బ్లోక్గా ఉంటామని, భవిష్యత్తులో బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మూడింట రెండు వంతుల మెజార్టీ (కనీసం 19 మంది ఎంపీలు) అవసరం కాగా, వీరి వద్ద 20 మంది ఉండటంతో సులభంగా చట్టపరమైన చిక్కుల నుంచి తప్పుకుని అసలైన తృణమూల్ పేరు, గుర్తుపై కూడా హక్కు సాధించేలా ప్లాన్ చేశారు.
ఈ తిరుగుబాటు వెనుక ఉన్న తెరవెనుక రాజకీయాలు ఢిల్లీ వేదికగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 14 మంది రెబెల్ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో బెంగాల్ సీఎం సువేందు అధికారితో కలిసి రహస్య సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఎంపీ శతాబ్ది రాయ్ నివాసంలో మరికొందరు భేటీ అయ్యారు. ఇటు రాజ్యసభలోనూ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేసిన వారం రోజులకే, జాతీయ అధికార ప్రతినిధి సుస్మితా దేవ్ కూడా రాజీనామా చేసి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను కలిశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం తగ్గినప్పుడు రాజ్యసభ ఎంపీలుగా తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉండదని గ్రహించి, ఆమె అస్సాం నుంచి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు.. రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. ఈ తిరుగుబాటు చేస్తున్న టీఎంసీ నేతల్లో అత్యధికులు స్వంతంగా ప్రజాబలం లేనివారే. వీరంతా కేవలం మమతా బెనర్జీ వ్యక్తిగత ఇమేజ్, ఆమె సపోర్ట్‌తోనే ఇన్నాళ్లూ పదవులు అనుభవించారు. ఇప్పుడు మమతా పట్టు కోల్పోవడంతో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎన్డీఏ అనే బలమైన రాజకీయ ఆశ్రయం వైపు చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ అన్నట్లు.. బెంగాల్లో ప్రతిపక్ష స్పేస్‌ను పూర్తిగా దెబ్బతీయడానికి బీజేపీ వ్యూహాత్మకంగా రితబ్రతా బెనర్జీ నేతృత్వంలో ఒక “షాడో తృణమూల్”ను సృష్టించింది. ప్రజా ఆగ్రహం అనే సెగ ఒకవైపు, బీజేపీ అందిస్తున్న రాజకీయ అండదండలు మరోవైపు కలిసి మమతా బెనర్జీ మూడు దశాబ్దాల రాజకీయ యంత్రాంగాన్ని ముక్కలు చేస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి దీదీ తన పార్టీని గట్టెక్కిస్తుందా లేదా అనేది బెంగాల్ భవిష్యత్తును శాసించనుంది.
తాజావార్తలు
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి