Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- పాకిస్థాన్‌లో ఘోర విషాదం
- పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్
- 21 మంది సైనికులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాయాది దేశం పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది. హెలికాప్టర్లో ఉన్న సిబ్బంది అందరూ అమరులయ్యారని పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR)ను ఉటంకిస్తూ పాకిస్థాన్ డాన్ పత్రిక వెల్లడించింది. హెలికాప్టర్లో 21 మంది సైనికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందరూ చనిపోయినట్లుగా సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్లో ఉన్న సైనిక సిబ్బంది దేశ సేవలో అమరులయ్యారని పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ దర్యాప్తు ప్రారంభించింది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ.. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ముజఫరాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పాకిస్థాన్ సైనిక వర్గాల్లో విషాదాన్ని నింపింది.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
ఎంఐ-17 హెలికాప్టర్ ప్రత్యేక ఇదే
MI-17 అనేది MI-8 నుంచి నవీకరించబడింది. కొత్త వెర్షన్ మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్ ద్వారా నిర్మించారు. రష్యాలో తయారైన అత్యధిక బరువు మోసే రవాణా హెలికాప్టర్ ఇది. ఈ హెలికాప్టర్లో 30 మంది సైనికులు, 12 స్ట్రెచర్లు, సుమారు 4 వేల సరుకు మోయగలదు. మూడు టన్నుల వరకు బరువు మోయగలదు. రెండు క్లిమోవ్ TV3-117 ఇంజిన్ల ద్వారా శక్తి పొందుతుంది. గంటలకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.
An Mi-17 helicopter of Pakistan Army Aviation crashed near Muzaffarabad during take-off "due to a technical fault". All personnel on board embraced martyrdom. There were no survivors, reports Pakistan's Dawn, citing Inter-Services Public Relations (ISPR)
— ANI (@ANI) June 10, 2026
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!