MLC Kavitha: రేపు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. చిన్న కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌజ్‌కి వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నం ఫామ్ హౌజ్ కు వెళ్తున్నట్లు సమాచారం. ఎల్లుండి అమెరికాకు బయలు దేరనున్నారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలోనే ఉండనున్నారు. కవిత చిన్న కుమారుడిని అమెరికాలో యూనివర్సిటీలో జాయిన్ చేయనున్నారు. కొన్ని రోజులుగా కేటీఆర్, కవితకు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే.
READ MORE: Hydra: సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా…
ఇదిలా ఉండగా.. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్‌తో గ్యాప్‌పై మాట్లాడటానికి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆమె దాటవేశారు. బీఆర్ఎస్పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఈ నెల ఆగస్టు పదిన బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా.. బీజేపీ హై కమాండ్ ఎందుకు చర్చించలేదని నిలదీశారు. దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాననని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత.