MLC Kavitha: రేపు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. చిన్న కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫామ్ హౌజ్‌కి వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నం ఫామ్ హౌజ్ కు వెళ్తున్నట్లు సమాచారం. ఎల్లుండి అమెరికాకు బయలు దేరనున్నారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలోనే ఉండనున్నారు. కవిత చిన్న కుమారుడిని అమెరికాలో యూనివర్సిటీలో జాయిన్ చేయనున్నారు. కొన్ని రోజులుగా కేటీఆర్, కవితకు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది.. కొండ దంపతులకు ఎమ్మెల్యేలకు మధ్య ఏర్పడిన వర్గ విభేదాలతో రెండు వర్గాలు ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రేపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు గాంధీ భవనకు వచ్చి కలవాలంటూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి కోరారు..