నా కుమారుడు రాహిల్‌ను కేసుల్లో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. ఎమ్మెల్యే షకీల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడి తప్పు వుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానన్నారు. నా కుమారుడు రాహిల్ చేయని తప్పుకు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదన్నారు. దీనిపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలన్నారు షకీల్. కేసు ట్రయల్…
బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ పై కాంగ్రెస్ దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించింది. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ నాయకుల దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించాలని కవిత కోరారు. ప్రతి చోట అల్లర్లు, దాడులు చేసే చరిత్ర కాంగ్రెస్ ది అని విమర్శించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వెళ్తున్న మహేంద్ర థార్ కారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో బ్రిడ్జి దిగి కొంతదూరం వెళ్లగానే రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నరేళ్ల బాలుడు కిందపడిపోయింది.. తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ఆ బాలుడు కన్నుమూశారు.. ఈ ప్రమాదంలో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది..…