MLA Shanampudi Saidireddy : ఏపీలో అన్ని పార్టీలు మోడీ పార్టీలుగా మారాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి అన్నారు ఎమ్మెల్య శానంపూడి సైదిరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు దేశంలో అందరు మంత్రులకు ఆదర్శమని ఆయన కొనియాడారు. ఏపీలో ఎవరిని అడిగినా హరీష్ రావు గురించి చెబుతారని, హరీష్ రావు నడిచే యంత్రం, ఓ రోబో లాంటి వారని పేరుందన్నారు. ఏపీ మంత్రి అప్పల రాజు చీదర అప్పలరాజు గా మారారని, ఏపీలో అన్ని పార్టీలు మోడీ పార్టీ లుగా మారాయన్నారు సైదిరెడ్డి. హరీష్ రావు లాంటి వారి మీద మాట్లాడేపుడు వంద సార్లు ఆలోచించుకోవాలని, తీరు మార్చుకోకపోతే ఏపీ ప్రజలు అక్కడి మంత్రుల మీద ఉమ్మేస్తారన్నారు. అభివృద్ధి ఎక్కడ ఎక్కువవుతుందో చర్చకు సిద్ధమని, మా ఆత్మ గౌరవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ, ఏపీ ల అభివృద్ధి పై నాతో ఏపీ మంత్రులు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
Also Read : Botsa Satyanarayana: హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
హరీష్ రావును మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా చర్చలో ఎదుర్కోలేదని, హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని ఆయన అన్నారు. కేసీఆర్ ఒకే ఒక ఎత్తుగడ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపిందని, 800 రోజులు కార్మికులు ఆందోళన చేసినా కేంద్రం దిగిరాలేదన్నారు. మాతో అభివృద్ధిలో పోటీ పడండని, కేసీఆర్ అభివృద్ధి గురించి తప్ప దేని గురించి మాట్లాడరని ఆయన తెలిపారు. ఏపీ మంత్రులు అభివృద్ధి తప్ప అన్నీ మాట్లాడుతున్నారని, చంద్రబాబు, జగన్ ఎవరూ ఢిల్లీ వెళ్లినా తమ స్వార్ధం కోసం వెళతారని, తెలంగాణ అభివృద్ధి మోడల్ ని ఏపీ అనుసరించాలన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలి అనేదే మా తపన అని, దేశం కూడా బాగుండాలని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!