Sri Ganesh: సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు మరింత ముదిరుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ట్రాఫిక్ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. బోయిన్‌పల్లి పెన్షన్ లైన్ ప్రాంతంలో పాతదారిని మూసివేసిన విషయంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడుతూ..
Read Also:All-Time XI: టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్!
బోయిన్‌పల్లి పెన్షన్ లైన్ ప్రాంతంలో పాతదారిని మూసివేయడంతో వాహనదారులు యూటర్న్ కోసం రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల దైనందిన జీవనశైలిని ప్రభావితం చేసేలా ట్రాఫిక్ మార్గాల పునర్వ్యవస్థాపన చేయడం హేతుబద్ధమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అలాగే పోలీసుల చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పరిస్థితిని సరిచేయాలి. సమస్యను 48 గంటల్లో పరిష్కరించకపోతే స్వయంగా నేనే ధర్నాకు దిగుతాను అంటూ హెచ్చరించారు.
Read Also:Beerla Ilaiah: కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ అధ్యక్ష ఎంపిక.. ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు..!
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యలు సాధారణమైపోయినప్పటికీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా, వినూత్న పద్ధతుల్లో పరిష్కారాలు అందించాల్సిన బాధ్యత ట్రాఫిక్ శాఖపై ఉందని శ్రీగణేశ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు త్వరితగతిన స్పందించి సమస్య పరిష్కరించే అవకాశం లేకపోలేదు.