పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజవకర్గంలో నంబూరు శంకరరావు గెలుపు కోసం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైన్యం ప్రచారానికి సిద్ధమైంది. శంకరన్న కోసం మేమంతా సిద్ధం అంటూ నినాదించింది. క్రోసూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రచారానికి సిద్ధమైన యువకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. పెత్తందార్లతో పేదల తరఫున యుద్ధం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా యువత ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియాది చాలా ముఖ్యమైన పాత్రగా మారింది.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, అబద్ధాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: YS Viveka murder case: వైఎస్ వివేకా కేసులో మధ్యంతర ఉత్తర్వులు.. విపక్ష నేతలకు కోర్టు కీలక ఆదేశాలు
అలాగే, ఎమ్మెల్యేగా ఐదేళ్లలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన నంబూరు శంకరరావుని మరోసారి గెలిపించాలని ఆయన సతీమణి శ్రీమతి నంబూరు వసంతకుమారి కోరారు. అందుకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఆప్యాయంగా అందరినీ పలకరించారు. ప్రతి ఇంటికి వెళ్లి గత ఐదేళ్లలో జరిగిన మంచిని తెలియజేశారు. ప్రతి గడపలో మహిళలకు వసంతకుమారికి సాదర స్వాగతం పలికారు.