గత ఐదేళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలని.. సంక్షేమ ప్రభుత్వ విజయానికి సారథులుగా ఉండాలని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైన్యం ప్రచారానికి సిద్ధమైంది. శంకరన్న కోసం మేమంతా సిద్ధం అంటూ నినాదించింది. క్రోసూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆవిష్కరించారు.