MLA KP Vivekananda : కేసీఆర్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ, ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఉదయం నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్ రెడ్డి, అల్లడు రాజశేఖర్ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో… నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా.. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థత గురయ్యారు. దీంతో ఆయను సూరారంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ క్రమంలో కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు మల్లారెడ్డి వెళ్లారు. అయితే.. మల్లారెడ్డి ఆసుపత్రిలోకి అనుమతించలేదు ఐటీ అధికారులు. దీంతో ఆసుపత్రి ముందే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. బీజేపీ సమావేశాల్లో రాష్ట్ర బాగోగులపై చర్చ చేస్తారు అనుకున్నామని, విషం గక్కే పనిలోనే పడ్డారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Puvvada Ajay Kumar : దాడులను సహించేది లేదు.. శ్రీనివాస రావుపై దాడి, హత్య చేసిన ఎవరినీ వదిలిపెట్టం
ఆట మొదలైంది అని ఎన్ని సార్లు చెప్తారు బై మీరు.. ప్రధాని వచ్చి కూడా .. స్థాయికి దిగదారి మాట్లాడారు అంటూ ఆయన మండిపడ్డారు. మునుగోడు ఓటమి తరవాత .. రోజు దాడులు చేస్తున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ధుడు.. కేంద్ర మంత్రికి రాజకీయం చేయడానికి చేత కావడం లేదని, కేసీఆర్ తో పోటీ పడలేకపోతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని, బీజేపీకి పోయే కాలం దగ్గర పడిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : భారత యుద్ధ చరిత్ర.. ఎన్ని యుద్ధాల్లో గెలిచిందో తెలుసా..?
ప్రభుత్వాలు కూల్చుడు… ఎమ్మెల్యేల కొనడమేనా బీజేపీ ధర్మం అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉప ఎన్నికలు టీఆర్ఎస్ తెచ్చిందని, బీజేపీ కుట్రల కోసం ఉప ఎన్నికలు తెస్తోందని ఆయన ఆరోపించారు. చేసేవి తప్పుడు పనులు.. విచారణ వద్దని కోర్టుకి వెళ్తారు.. బండి సంజయ్ ప్రమాణం చేశారు.. మరి విచారణ అంటే వద్దు అంటారు ఎందుకు.. బీఎల్ సంతోష్ దేవుడు అంటా.. ఎవరికి దేవుడు.. దేవుడా..దెయ్యమా..? దేవుడే అయితే విచారణ కి రాడా సంతోష్… కవిత మీద తప్పుడు ప్రకటనలు చేసే ఎంపీలు ఉన్నారు బీజేపీలో.. కోర్టు సిట్ విచారణకు హాజరు అవ్వాలని చెప్తే కూడా హాజరు కారా.. వివేక్.. ఈటల..ధర్మపురి లాంటి వల్లపై ఐటీ విచారణ ఎందుకు జరగడం లేదు.. బీజేపీ పదే పదే దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయినా మేము భయపడటం లేదని, బీజేపీ వేధించని రాష్ట్రం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
- CM Yogi Adityanath: దేశానికి "ధర్మ హింస" అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
- Rajasthan: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
తాజావార్తలు
-
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!
-
IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
-
CM Yogi Adityanath: దేశానికి “ధర్మ హింస” అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
-
NFHS: దేశంలో పెరుగుతున్న సీ-సెక్షన్ కేసులు.. ఈ రాష్ట్రంలో 90% ప్రసవాలు సిజేరియన్ ద్వారానే.. NFHS సంచలన రిపోర్ట్
-
DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..