ఇండో-పాక్ వార్ (1947-48) కాశ్మీర్ కోసం రెండు దేశాల మధ్య యుద్ధం. పాకిస్తాన్ దురాక్రమణను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది.

జూనాగఢ్, హైదరాబాద్ విలీనం 1947లో జూనాగఢ్, 1948లో హైదరాబాద్ భారతదేశంలో కలిపేందుకు ఇండియన్ ఆర్మీ సైనిక చర్య చేసింది. పోర్చుగల్ నుంచి 1954లో దాద్రా నగర్ హావేలీని ఇండియాలో విలీనం చేసింది.

ఇండో-చైనా వార్(1962) ఇండియా, చైనా యుద్ధంలో భారత్ పరాజయం పాలైంది. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కోల్పోయింది.

ఇండో- పాక్ వార్(1965) 1965లో పాకిస్తాన్, భారత్ పై దాడి చేసింది. ఇది యుద్ధంగా మారింది. ఇండియన్ ఆర్మీ ఏకంగా లాహోర్ నగరాన్ని స్వాధీనం చేసుకునే స్థితిలోకి వెళ్లింది.

నాథులా- చోలా ఘర్షణ(1967) 1962లో చైనా చేతిలో ఓడిన భారత్.. తన బలాన్ని 1967లో చూపింది. సిక్కిం నుంచి చైనా బలగాలను తరిమికొట్టింది.

బంగ్లాదేశ్ లిబరేషన్ వార్(1971) తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్ గా మార్చింది ఇండియా. పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేసింది.

కార్గిల్ వార్(1999) పాకిస్తాన్ దొడ్డి దారిన కార్గిల్ ప్రాంతంలోని పలు శిఖరాలను ఆక్రమించింది. భారత్ తిరిగి ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. పాక్ సైన్యానికి చుక్కలు చూపింది.