Site icon NTV Telugu

MLA KP Vivekananda : కేసీఆర్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ, ఐటీ దాడులు

Kp Vivekananda

Kp Vivekananda

నిన్న ఉదయం నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లడు రాజశేఖర్‌ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో… నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా.. మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి అస్వస్థత గురయ్యారు. దీంతో ఆయను సూరారంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ క్రమంలో కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు మల్లారెడ్డి వెళ్లారు. అయితే.. మల్లారెడ్డి ఆసుపత్రిలోకి అనుమతించలేదు ఐటీ అధికారులు. దీంతో ఆసుపత్రి ముందే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. బీజేపీ సమావేశాల్లో రాష్ట్ర బాగోగులపై చర్చ చేస్తారు అనుకున్నామని, విషం గక్కే పనిలోనే పడ్డారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Puvvada Ajay Kumar : దాడులను సహించేది లేదు.. శ్రీనివాస రావుపై దాడి, హత్య చేసిన ఎవరినీ వదిలిపెట్టం
ఆట మొదలైంది అని ఎన్ని సార్లు చెప్తారు బై మీరు.. ప్రధాని వచ్చి కూడా .. స్థాయికి దిగదారి మాట్లాడారు అంటూ ఆయన మండిపడ్డారు. మునుగోడు ఓటమి తరవాత .. రోజు దాడులు చేస్తున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ధుడు.. కేంద్ర మంత్రికి రాజకీయం చేయడానికి చేత కావడం లేదని, కేసీఆర్ తో పోటీ పడలేకపోతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని, బీజేపీకి పోయే కాలం దగ్గర పడిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : భారత యుద్ధ చరిత్ర.. ఎన్ని యుద్ధాల్లో గెలిచిందో తెలుసా..?

ప్రభుత్వాలు కూల్చుడు… ఎమ్మెల్యేల కొనడమేనా బీజేపీ ధర్మం అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉప ఎన్నికలు టీఆర్‌ఎస్‌ తెచ్చిందని, బీజేపీ కుట్రల కోసం ఉప ఎన్నికలు తెస్తోందని ఆయన ఆరోపించారు. చేసేవి తప్పుడు పనులు.. విచారణ వద్దని కోర్టుకి వెళ్తారు.. బండి సంజయ్ ప్రమాణం చేశారు.. మరి విచారణ అంటే వద్దు అంటారు ఎందుకు.. బీఎల్‌ సంతోష్ దేవుడు అంటా.. ఎవరికి దేవుడు.. దేవుడా..దెయ్యమా..? దేవుడే అయితే విచారణ కి రాడా సంతోష్… కవిత మీద తప్పుడు ప్రకటనలు చేసే ఎంపీలు ఉన్నారు బీజేపీలో.. కోర్టు సిట్ విచారణకు హాజరు అవ్వాలని చెప్తే కూడా హాజరు కారా.. వివేక్.. ఈటల..ధర్మపురి లాంటి వల్లపై ఐటీ విచారణ ఎందుకు జరగడం లేదు.. బీజేపీ పదే పదే దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయినా మేము భయపడటం లేదని, బీజేపీ వేధించని రాష్ట్రం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version