MLA KP Nagarjuna Reddy: అశేష జానధరణ మధ్య గడప గడపకు పర్యటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామ (సచివాలయం) పంచాయతీలో మూడవ రోజు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఉడుముల శ్రీనివాస రెడ్డి గారితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. ప్రతి గడపకు వెళ్లి లబ్దిదారులను కలుస్తూ.. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వారికి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు.
Read Also: Constable Arrest: హోటల్ లో కానిస్టేబుల్ రాసలీలలు.. యువతితో బుక్కయ్యాడు రక్షకభటుడు
ఇక, ప్రతి గడపకు వెళ్తూ.. స్థానికులను పలకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతోన్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి మహిళలు బొట్టు పెట్టి హారతలు పట్టారు.. దారి పొడవునా పూల వర్షం కురిపించారు.. ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి స్వాగతం పలుకుతూ ఊరినిండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. దారులన్నీ పూలమయం అయ్యాయి.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, వైసీపీ కన్వీనర్, జేసీఎస్ కన్వీనర్,ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ముఖ్య నాయకులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.