తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ జీరో అవర్‌లో అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ఈద్గా గ్రౌండ్ పక్కన క్యాంపు ఆఫీస్‌కు స్థలం ఇవ్వమని అడిగా. అధికారుల నుంచి సరైన స్పందన లేదన్నారు దానం. అప్లై..అప్లై..నో రిప్లై అన్నట్లు పరిస్థితి ఉందన్నారు. అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇస్తా.. నాకు సమాచారం ఇవ్వకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.. అధికారులు, అధికారులు మాట్లాడుకుని కాంప్రమైజ్ అవుతున్నారు.. ఎమ్మెల్యేలు చెప్పినా వినడం లేదు. నేను పోయి నా స్టైల్ లో ఫౌండేషన్ స్టోన్ ను పగలకొట్టేసిన.
Also Read:Dragon : డ్రాగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నెట్ ఫ్లిక్స్
నేను కూడా మంత్రిగా పని చేశా. నాకు తెలుసు ఏం మాట్లాడాలో అని దానం అన్నారు. అలాగే స్కూల్ పిల్లకు మిడ్ డే మీల్స్ లో ఎగ్స్ అందించడం, ఆర్ఓఆర్ ప్లాంట్స్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వీటిపై మంత్రులు నోట్ చేసుకున్నామంటరు ఆ తర్వాత తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేస్తరు. ఇది నేను చేశాను కాబట్టి చెప్తున్నానని అన్నారు. ఎవ్వరినీ బ్లేమ్ చేయడం లేదని దానం తెలిపారు.