Smriti Irani: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అనే పదానికి కవల పిల్లలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ కి ఓటేసినట్టే అన్నారు. కేసీఆర్, రాహుల్ గాంధీ తెలంగాణ గల్లీల్లో కొట్లాడుతారన్నారు. ఢిల్లీలో కలిసి అలయ్ బలయ్ చేసుకుని చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీది అన్నారు. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించండి..బీజేపీని గెలిపించండని కోరారు. నీళ్లు, నిధులు, నియామకం కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి అడ్డగోలుగా వ్యయం పెంచి పూర్తి చేశారన్నారు. అయినా కూడా 60 శాతం భూములకు నీళ్లు అందడం లేదని మండిపడ్డారు. ఈ పదేళ్ళలో 5 లక్షల కోట్ల అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం అని కీలక వ్యాఖ్యలు చేశారు.
నియామకాల విషయంలో తెలంగాణ యివతకి అన్యాయం చేసి తన కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిందోకటి… చేసేదొక్కటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ పేదలకు ఇవ్వలేదన్నారు. ప్రధాని మోడీ అవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్ళు కట్టించారన్నారు. TSPSC పేపర్ లీకులతో యువత జీవితాలని చీకటిలో పడేశారన్నారు. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా చేయడానికి మోడీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని తెలిపారు. టెక్స్ టైల్ పార్క్ ఇస్తామని కెసిఆర్ ఇవ్వలేదని, ప్రధాని మోడీ మంజూరు చేశారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాల్లో కేసిఆర్ హస్తం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మోసం చేసే కెసిఆర్ వైపా.. అభివృద్ధి చేసే మోడీ వైపు ఉందామా ప్రజలు ఆలోచన చేసుకోవాలని తెలిపారు. రామగుండం ఫర్టీలైజర్ కంపెనీ ఓపెన్ చేసి ఎరువుల కొరతను తీర్చిన ఘనత మోడిది అని తెలిపారు.
Hyderabad: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన కారు..
Also Read
తాజావార్తలు
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..