Miss India- Miss Universe : టాలీవుడ్ తెరపై మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ బ్యూటీఫుల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో విన్నర్ ఆర్ రన్నర్ అయిన భామలు ఎక్కువగా బాలీవుడ్లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పుడో అడపా దడపా సౌత్ సినిమాల వైపు తొంగి చూసేవారు. కానీ కాలం మారింది. సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారడంతో అందాల పోటీల్లో విన్నర్, రన్నర్‌గా నిలిచిన భామలు టాలీవుడ్ తెరపై ప్రత్యక్షమౌతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకెళుతోన్న మీనాక్షి చౌదరి.. 2018 మిస్ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. వెంటనే హిందీలో కెరీర్ స్టార్ట్ చేసిన మీనూ టాలెంట్ టాలీవుడ్ గుర్తించింది. రీసెంట్లీ అనగనగా ఒక రాజుతో హాయ్ చెప్పిన మీనాక్షి.. త్వరలో వృషకర్మతో రాబోతుంది.
Also Read : OTT Releases This Week : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
Also Read
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
టాలీవుడ్ స్క్రీన్‌పై తళుక్కున మెరుస్తోన్న మరో మిస్ ఇండియా మానస వారణాసి. 2020 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచిన ఈ తెలుగమ్మాయి.. బాలీవుడ్ ఆఫర్స్ కాదని.. తెలుగులోకి ఇంట్రడ్యూసైంది. దేవకీ నందన వాసుదేవతో పరిచయమైన మానస.. కపుల్ ఫ్రెండ్లీతో తన లక్ పరీక్షించుకోబోతుంది. అలాగే 2024 మిస్ యూనివర్శ్ ఇండియా అందాల కిరీటాన్ని కైవసం చేసుకున్న రియా సింఘా సత్య హీరోగా నటిస్తున్న జెట్లీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. వారణాసితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మోస్ట్ బ్యూటీఫుల్ గర్ల్ ప్రియాంక చోప్రా కూడా 2000 మిస్ వరల్డ్ విన్నర్. ఆమె టాలీవుడ్ ఎంట్రీ అప్పట్లోనే జరగాల్సింది కానీ అనివార్య కారణాలతో ఆగిపోయింది. బాలీవుడ్లో స్టార్ డమ్ సంపాదించి హాలీవుడ్ చెక్కేసిన ప్రియాంక చోప్రా మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు ఆడియన్స్‌కు మందాకినిగా కనిపించబోతోంది. 2016 అంతర్జాతీయ అందాల పోటీలో విన్నరైన శ్రీనిధి శెట్టి రైజింగ్ బ్యూటీగా మారింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ రన్నరప్ టైటిల్ గెలిచిన శోభితా.. ఏడాది క్రితం మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరై.. తాజాగా చీకటిలో అనే ఓటీటీ ఫిల్మ్‌తో హాయ్ చెప్పింది. మొత్తానికి టాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేస్తున్నారు ఈ బ్యూటీఫుల్ గర్ల్స్.
తాజావార్తలు
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!