‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్.. ‘లెనిన్’ మూవీతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కంకణం కట్టుకున్నారు. మాస్ ప్లస్ ఏమోషన్ మిక్స్ చేసిన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మిల్క్ బాయ్ కాస్తా డిగ్లమరస్ బాయ్‌గా కూడా మారిపోయ్యాడు పాపం. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు ప్రాంతంలో సాగుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుందట.
Also Read : Adah Sharma : బాలీవుడ్ నెపోటిజంపై.. అదా శర్మ కామెంట్స్ వైరల్
ఇక అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో.. అఖిల్ తో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.. ఏంటీ అంటే మూవీలో అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా తిరుమల ప్రాంతంలో భారీ సెట్ వేస్తున్నారు. తిరుమల కొండల నేపథ్యంలో ఈ సీక్వెన్స్ నడుస్తోందట. అలాగే సినిమాలో నేటివిటీ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారట. మొత్తానికి ఈ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్ అవుతుందట. ఏది ఏమైనా లెనిన్ కోసం అఖిల్ బాగా కష్ట పడుతున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.