Rape Attempt: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని పిల్లోనిగూడ గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై నవీన్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం రోజున బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని గమనించిన నవీన్.. తాగడానికి నీళ్లు కావాలని అడిగి ఇంట్లోకి ప్రవేశించాడు. దానితో ఆ బాలిక అతనికి నీళ్లు ఇచ్చింది. నీళ్లు తాగాక గ్లాసును కిచెన్‌లో పెట్టడానికి బాలిక లోపలికి వెళ్లగా.. ఆ యువకుడు వెంటనే ఇంటి తలుపుకు గడియ పెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు.
ఈ దారుణం తర్వాత నవీన్ తన బైక్‌పై అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వారు ఆ యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, నవీన్ తన బైక్‌తో వారికి డ్యాష్ ఇస్తూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దారుణ విషయమై బాధితురాలిని విచారించగా.. అత్యాచారానికి పాల్పడిన యువకుడు నవీన్ తమ బంధువేనని ఆమె తెలిపింది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు వెంటనే శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. యాప్ ఐకాన్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం!