Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. యాప్ ఐకాన్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram: మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్ తాజాగా టీన్ యూజర్ల కోసం ప్రత్యేకమైన ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో టీనేజ్ అకౌంట్ కలిగిన యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఐకాన్‌ను స్వయంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ కింద మొత్తం ఆరు ప్రత్యేకమైన యాప్ ఐకాన్ థీమ్‌లు అందిస్తోంది. వీటిలో ఫైర్ (Fire), ఫ్లోరల్ (Floral), క్రోమ్ (Chrome), కోస్మిక్ (Cosmic), స్లైమ్ (Slime) వంటి ఆకర్షణీయమైన డిజైన్‌లు ఉన్నాయి. ఈ థీమ్‌లను ప్రముఖ ఇలస్ట్రేటర్ doncarrrlos (Carlos Oliveras Colom), ఇన్‌స్టాగ్రామ్ డిజైన్ టీమ్ కలిసి రూపొందించారు.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ఈ ఫీచర్ ద్వారా టీనేజర్లు తమ వ్యక్తిగత స్టైల్, అభిరుచిని ప్రతిబింబించేలా యాప్ ఐకాన్‌ను మార్చుకోవచ్చు. అలాగే యూజర్‌లు తమకు ఇష్టమైన థీమ్‌ను ఎంచుకొని, యాప్ అనుభవాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ మాత్రం టీన్ అకౌంట్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ హోమ్ స్క్రీన్‌లో ఉన్న “Instagram” లోగోపై ట్యాప్ చేస్తే, కొత్త ఐకాన్‌లను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఈరోజు నుంచే అందుబాటులోకి వచ్చింది.
Viral : ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
దీపావళి సందర్భంగా స్టోరీల్లో కొత్త ఎఫెక్ట్‌లు, అలాగే ‘ఎడిట్స్’ యాప్‌లో కొత్త ఫీచర్‌లు ప్రవేశపెట్టిన ఇన్‌స్టాగ్రామ్, ఇప్పుడు టీన్ యూజర్లకు ఈ కస్టమ్ ఐకాన్ ఆప్షన్ అందించడం ద్వారా సృజనాత్మకతను మరింత ప్రోత్సహిస్తోంది. ఈ అప్‌డేట్ ద్వారా యువ యూజర్లు తమ యాప్‌ను మరింత వ్యక్తిగతంగా, వినూత్నంగా మార్చుకోగలుగుతున్నారు. ఇది ఇన్‌స్టాగ్రామ్ వినియోగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చబోతోందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?