Human SacriFice: దారుణం.. డబ్బుపై ఆశతో బాలుడు నరబలి.. పిల్లాడి తలనరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human SacriFice: కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలోని సిల్వాస్సాలో నరబలి ఉదంతం తెరపైకి వచ్చింది. ధనవంతులు కావాలనే ఆశతో తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, ఆపై నరబలి ఇచ్చారు. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేశారు. ఈ దారుణ ఘటనలో మైనర్‌తో సహా ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నరబలి ఇస్తే డబ్బులు వస్తాయన్న మూఢనమ్మకంతో.. లోకజ్ఞానం కూడా తెలియని తొమ్మిదేళ్ల చిన్న పిల్లాడిని కొందరు దుండగులు తలనరికి చంపేశారు. 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. ఆపై తలనరికి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అనంతరం నిందితులు మృతదేహాన్ని ముక్కలు చేయగా.. మృతుడి శరీర భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రూరమైన నేరంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వెల్లడించారు.
పొరుగున ఉన్న గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపిలో కాలువ సమీపంలో తల నరికిన మృతదేహం లభించడంతో పోలీసులు గత వారం విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులతో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాద్రానగర్ హవేలీలోని సైలీ గ్రామానికి చెందిన బాలుడు.. డిసెంబర్ 29 నుంచి కనిపించకుండా పోయాడు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సిల్వాస్సా పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సిల్వాస్సాకు 30 కిలోమీటర్ల దూరంలో గుజరాత్‌లోని వాపిలో కాలువలో తల లేని శరీరాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం.. దాద్రానగర్ హవేలీలో అదృశ్యమైన బాలుడిదే అని అనుమానించారు. శరీర భాగాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. దర్యాప్తులో భాగంగా ఒక బాలుడ్ని పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
Land Dispute: భగ్గుమన్న భూవివాదం.. పరస్పర కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని తాపీ జిల్లా కప్రదా తాలూకాలోని కర్జన్ గ్రామానికి చెందిన బాలుడు.. సైలీ గ్రామంలోని చికెన్ దుకాణంలో పని చేస్తున్నాడు. అతడిని పట్టుకుని ఆరా తీస్తే.. డిసెంబర్ 29న సైలీ గ్రామం నుంచి తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారని తెలిసింది. నరబలి ఇస్తే డబ్బులు వస్తాయనే ఆశతో అతడ్ని నరబలి ఇచ్చారని తెలిసింది. పోలీసులకు పట్టుబడిన బాలుడితో పాటు శైలేష్ కోహేర్కా, రమేష్ సన్వార్ అనే వ్యక్తులు కలిసి ఈ ఘోరానికి పాల్పడ్డారు. నరబలి ఇస్తే డబ్బు వస్తుందని శైలేష్ కోహేర్కా బాలుడి తల నరికేయాలని ప్రేరేపించగా.. అందరూ కలిసి బాలుడిని అతి కిరాతకంగా నరికేశారు.
తాజావార్తలు
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!