‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో తుపాను ప్రభావం మొదలైంది. రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లతో సహా స్పెషల్ ఆఫీసర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు.
Also Read: Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. హైదరాబాద్లో ఒక్కరోజే ఎంత తగ్గిందంటే?
కాకినాడ జిల్లాలో 6 మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని, ఎక్కువ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనిత కలెక్టర్లకు సూచించారు. ‘రోడ్డు బ్లాక్ అయితే డైవర్షన్స్ ముందే మ్యాప్ చేసుకోవాలి. జిల్లా, మండల కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రతి ఒక్కరికి చేరవేయాలి. చెట్లు, స్తంభాలు పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముందుగానే ట్రాన్స్ ఫార్మర్లు, పోల్స్ సిద్ధంగా ఉంచాలి. జేసీబీలు, జనరేటర్స్ సిద్ధం చేయాలి. అలానే భారీ హార్డింగ్స్ ను తొలగించాలి. డెలివరీ దగ్గరలో ఉన్న గర్భిణీల కుటుంబాలను అలర్ట్ చేయాలి. మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులు ఏర్పాటు చేయాలి’ అని అధికారులతో హోంమంత్రి చెప్పారు.