Alluarjun : పుష్ప 3 కూడా ఉండొచ్చు.. కన్ఫామ్ చేసిన ఐకాన్ స్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప మూవీ ఫ్యాన్స్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభవార్త చెప్పారు.. పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ ప్రకటించారు.బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాను స్క్రీనింగ్ చేశారు. పుష్ఫ తరఫునే కాకుండా ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియన్ ప్రతినిధిగా అల్లుఅర్జున్ హాజరు అయ్యారు.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమాకు మూడో భాగం కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.. ఓ ఫ్రాంచైజ్‌లా పుష్ప సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.పుష్ప సినిమా థియేటర్ల కంటే ఓటీటీలో ఎక్కువగా అభిమానులకు రీచ్ అయ్యిందని ఆయన తెలిపారు.ఓటీటీ వల్లే ఈ సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఏర్పడి 2021లో బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా పుష్ప నిలిచిందని అల్లు అర్జున్ తెలిపారు.అలాగే పుష్ప పార్ట్ 2పై బన్నీ బెర్లిన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు..
పుష్ప పార్ట్ 2లో పుష్పరాజ్లోని ఓ డిఫరెంట్ షేడ్‌ను చూస్తారని పుష్పకు మించి తన క్యారెక్టరైజేషన్ హై లెవెల్లో ఉంటుందని, పుష్పరాజ్‌కు ఎదురయ్యే సవాళ్లను ఆడియెన్స్ ఊహలకు మించి భారీ స్కేల్లో సుకుమార్ ఈ సినిమాలో చూపించబోతున్నాడని అల్లుఅర్జున్ తెలిపారు..పుష్ప సినిమాను రీజనల్ లెవెల్లో తెరకెక్కించామని, పుష్ప 2ను మాత్రం ఇంటర్సేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నామని తెలిపారు.పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కాబోతోంది. ఎర్రచందనం సిండికేట్ నాయకుడిగా మారిన తర్వాత పుష్పరాజ్ జీవితంలో జరిగిన పరిణామాలు అలాగే భన్వర్‌సింగ్ షెకావత్‌తో పుష్పరాజ్‌కు ఏర్పడిన వైరం నేపథ్యంలో పుష్ప సీక్వెల్ సాగనున్నట్లు సమాచారం. పుష్ప లో ఫహాద్ ఫాజిల్ రోల్ తక్కువ నిడివితో కనిపించింది. సెకండ్ పార్ట్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్లో అతడు కనిపించనున్నట్లు తెలుస్తుంది.. అలాగే పుష్ప 2లో కూడా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది.
Also Read
- Bhargavastra: డ్రోన్ ముప్పుకు చెక్.. ‘‘భార్గవాస్త్ర’’ టెస్ట్ సక్సెస్..
- AP Local Body Elections: ఎన్నికల అనంతరం అలర్ట్.. ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.. డీజీపీ కీలక ప్రకటన
- Constitution Day: కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు: అనురాగ్ ఠాకూర్
- Parliament Special Session 2026: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Bhargavastra: డ్రోన్ ముప్పుకు చెక్.. ‘‘భార్గవాస్త్ర’’ టెస్ట్ సక్సెస్..
-
Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
-
AP Local Body Elections: ఎన్నికల అనంతరం అలర్ట్.. ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.. డీజీపీ కీలక ప్రకటన
-
Constitution Day: కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు: అనురాగ్ ఠాకూర్
-
Parliament Special Session 2026: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!