NTV Telugu Site icon

Minister Uttam Kumar Reddy: కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే.. ఈ ప్రాజెక్టు విషయంలో అన్ని అబద్ధాలే చెప్పారు..

Uttam

Uttam

Minister Uttam Kumar Reddy: కేవలం కమీషన్ల కక్కుర్తి కోసం బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను తీసేసి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కట్టారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 30 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లకు పెంచి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు అయ్యిందని.. కాళేశ్వరం మొత్తం పూర్తి కావడానికి రూ. లక్షా 47 వేల కోట్లు అవసరం అవుతాయని కాగ్ స్పష్టం చేసిందన్నారు. కాళేశ్వరంలో అన్ని పంపులు నడిపినప్పుడు 10 వేల కోట్ల కరెంట్ బిల్లు రాబోతుందని కాగ్ చెప్పిందన్నారు. హై ఇంట్రస్ట్ లోన్లు కేసీఆర్ సర్కార్ తీసుకుందని మంత్రి వెల్లడించారు. 15 వేల కోట్ల వడ్డీ కాళేశ్వరం లోన్లకు కడుతున్నామని తెలిపారు. ఇరిగేషన్ సెక్టారును కేసీఆర్ అండ్ కంపెనీ నాశనం చేశారని మంత్రి మండిపడ్డారు.

Read Also: Jagga Reddy: హైదరాబాద్‌కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..?

ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారంటూ ఆరోపించారు. కాళేశ్వరంను పిక్నిక్ స్పాట్ చేశారని.. అప్పుడు పిక్నిక్ వెళ్లారని.. ఇప్పుడు కూడా పిక్నిక్ కే వెళ్లారని బీఆర్‌ఎస్ నేతల సందర్శనపై విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ నిర్మాణం సమయంలో ఇరిగేషన్ మంత్రి కేసీఆరే అని.. కాళేశ్వరం పియర్స్ కూలినప్పుడు ఇరిగేషన్ మంత్రి కేసీఆరే అంటూ మంత్రి తెలిపారు. అక్టోబర్ 21న మేడిగడ్డ వద్ద పెద్ద శబ్దం వచ్చి 20వ పిల్లర్ కుంగిపోయిందని.. ఒక్కో బ్లాక్ ఆరు ఫీట్లు భూమిలోకి కుంగిందని.. నాసిరకం కట్టడాలు, నాసిరకం మెంటనెన్స్, నాణ్యత లేకపోవడం వల్లే కూలిందని ఎన్డీఎస్ఏ చెప్పిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో అన్ని అబద్ధాలే చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజీలు నీటి నిల్వ కోసం కట్టరు.. నీటి మళ్లింపు కోసం కడతారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతే చాలా ప్రమాదం వాటిల్లుతుందని.. భద్రాచలం పట్టణం నీట మునుగుతుందని తెలిపారు.

ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీ గేట్లు తెరిచే పెడతామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రేపో ఎల్లుండో పంపింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. మేడిగడ్డకు వెళ్లి మాపై బురదజల్లే ప్రయత్నం మంచిదికాదని ఆయన పేర్కొన్నారు. హడావుడిగా ఒక మనిషి సెంట్రిక్‌గా కాళేశ్వరం పనులు జరిగాయని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్ మీరందరు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర భారత దేశంలో ఇంత ఘోర తప్పిదం ఎక్కడా, ఎవరూ చేయలేదని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే తాము ముందుకు వెళ్తున్నామన్నారు. కేటీఆర్‌ అనాలోచితంగా మాట్లాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారని ఆయన ఆరోపించారు.