NTV Telugu Site icon

Tummala Nageswara Rao: అందుకే వాళ్లకి రుణమాఫీ కాలేదు.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి.. మంత్రి సూచన

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు. “రైతులను దగా చేసి, అయోమయానికి గురి చేసింది గత ప్రభుత్వం.. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మొదటి పంటలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో.. హామీని అమలు చేశాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లాంటి సాంకేతిక ఇబ్బందులు వల్ల కొన్ని ఆగాయి. ఆగస్టు 14 లోపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు లిస్టు తయారు చేసి ఇచ్చారు. దానికి అనుగుణంగా చేశాం. గత ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కొద్ది మంది రైతులను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41.78 892లక్షల మంది రుణాలు తీసుకున్న లిస్టు వచ్చింది. 40 బ్యాంకుల నుంచి వచ్చిన లిస్టు ప్రకారం నగదు జమ చేశాం.” అని ఆయన వెల్లడించారు.

READ MORE: Champai soren: చంపై సోరెన్ యూటర్న్.. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు!

రూ. 31 లక్షల కోట్లు అవసరమని మంత్రి అన్నారు. ఆగస్టు15 న రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. సర్వర్ ఇబ్బందులతో మరి కొన్ని బ్యాంకులు కొంత మంది లిస్ట్ ఇవ్వలేదన్నారు. నిసిగ్గుగా నిర్లజ్జగా ప్రతి పక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. “గత ప్రభుత్వం ఎన్నికలకి కొద్ది రోజుల ముందు బూటకపు మాటలతో ఓఆర్ఆర్ ను అమ్మి రూ. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని కొద్ది మందికి మాఫీ చేశారు. దేశ చరిత్రలో మొదటి సంవత్సరం, మొదటి పంటలోనే ఋణాలు మాఫీ చేసిన ఘనట కాంగ్రెస్ ది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే… ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రతి కుటుంబానికి ఋణ విముక్తి చేయడానికి మేము ఓ మంచి నిర్ణయం తీసుకున్నాం. కాగ్ నివేదిక కూడా గత ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇలాంటి చిల్లారా రాజకీయాలు మానుకోవాలి. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం… పూర్తి చేశాం. రుణమాఫీ కాని వాళ్ళు.. బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే ఆ తర్వాత వాళ్లవి కూడా రుణమాఫీ చేస్తాం.” అని వ్యాఖ్యానించారు.