NTV Telugu Site icon

Minister Tummala Nageswara Rao: రుణమాఫీ పొందని రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్!

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తాజాగా రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల స్పందించారు. ఏదేని కారణాల వల్ల రూ. 2 లక్షలలోపు ఉన్న రుణం మాఫీ కానీ ఖాతాదారుల వివరాలు సేకరించి, పోర్టల్ లో అప్ లోడ్ చేసేందుకు వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. త్వరలో వారికి కూడా రుణమాఫీ అవుతుందని పేర్కొన్నారు. “కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోపే 26,140.13 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వం పెట్టిన రైతుబంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు ఆయిల్ పాం రైతులు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలు చెల్లించాం. మాది చేతల ప్రభుత్వం, దిగజారుడు రాజకీయాలు మాకు రావు. గత ప్రభుత్వం ఓప్పందం చేసుకున్న కంపెనీ లల్లో 30 శాతం కూడా గ్రౌండ్ అవ్వలేదు. ” అని మంత్రి స్పష్టం చేశారు.

READ MORE: Minister Sridhar Babu: మా విజన్ వేరు.. కంపెనీలను హైదరాబాద్ కే పరిమితం చెయ్యం

కాగా… నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో 2,500 మంది ఖాతాలు ఉంటే 500 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని 2 వేల మందికి రుణమాఫీ రాలేదని నిరసన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తే 1043 మంది డాటాను పంపలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నట్లు రైతుల ఆరోపణ చేశారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యానికి తాము బలి అవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట గ్రామంలోని కెనరా బ్యాంక్ ముందు మెట్ పల్లి – ఖానాపూర్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. బ్యాంక్ తప్పిదం వల్లే మూడు విడతలుగా చేసిన రుణమాఫీ రాలేదని రైతుల ఆరోపణలు చేశారు. మెట్ పల్లి సీఐ సర్డిచెప్పడంతో ధర్నాను విరమించారు.